హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ
కమలాన్ని వీడి కారెక్కుతున్న నేతలు
తాజాగా వంద మంది చేరిక
గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్/ హుజూరాబాద్‌టౌన్ జూలై 24: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతున్నది. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు గులాబీ బాట పడుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కోక్కరూ పార్టీని వీడి ‘కారె’క్కుతున్నారు. తాజాగా హుజూరాబాద్ బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, బీజేపీ పట్టణ కార్యదర్శి తూర్పాటి శంకర్, దళిత మోర్చా పట్టణ ఉపాధ్యక్షుడు తూర్పాటి భూపతిరాజు నేతృత్వంలో 100 మంది నేతలు కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో శనివారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆగ్రనాయకత్వం అవలంబిస్తున్న ఒంటెద్దు పొకడలు నచ్చకే పార్టీని వీడుతున్నామని ప్రకటించారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నామని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా గెలుపునకు నిర్విరామంగా శ్రమిస్తామని పేర్కొన్నారు. ఈటల హయాంలో హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. బీజేపీ దళిత, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని దుయ్యబట్టారు. పార్టీలో చేరిన వారిలో దళిత మోర్చా పట్టణ సహాయ కార్యదర్శి శివకుమార్, 23వ వార్డు బీజేపీ అధ్యక్షుడు టీ రాజ్‌కుమార్, నాయకులు టీ కుమార్, రాజు, ఎం.రమేశ్, కృష్ణంరాజు, దుర్గాప్రసాద్, ఉపేందర్, వెంకటేశ్, శేఖర్, ఎం.తిరుపతి, టీ.మహేశ్, సురేష్, అభిరామ్, అనిల్, సాంబరాజు, సమ్మయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై.సునీల్‌రావు, నాయకులు చల్ల హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు
వీణవంక, జూలై 24: మండలంలోని హిమ్మత్‌నగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 25మంది నాయకులు శనివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ నాయకులు మ్యాక సమ్మయ్య, ఉప సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. జడల శ్రీనివాస్, ఛాంద్పాషా, రాజ్‌మహ్మద్, మొండయ్య, గట్టయ్య, కొమురయ్య, దాసరి కొమురయ్య, వీరయ్య, శంకరయ్య, బొంతల సమ్మయ్య, రాజు, తదితరులు పార్టీలో చేరగా, కార్యక్రమంలో వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, దాసరి వీరన్న, నాయకులు అంగిడి సతీశ్, నర్సింగారావు, గెల్లు కొమురయ్య, లోనె శ్రీకాంత్ ఉన్నారు.