e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home కరీంనగర్ చట్టాలపై అవగాహనతోనే సత్వర న్యాయం

చట్టాలపై అవగాహనతోనే సత్వర న్యాయం

పేదలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి ఎంజీ ప్రియదర్శిని
సిరిసిల్లలో న్యాయసేవల శిబిరానికి హాజరు

గాంధీచౌక్‌, అక్టోబర్‌ 23: చట్టాలపై అవగాహనతోనే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని అన్నారు. ప్రతిపేదవాడికి ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. శనివారం సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో పాన్‌ ఇండియా నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో న్యాయ సేవల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సు ప్రాంగణం వద్దకు చేరుకున్న ప్రిన్సిపల్‌ జడ్జికి ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పథకాల అమలుపై అవగాహనకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో న్యాయ సేవ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. చట్టం దృష్టిలో అం దరూ సమానమేనని చెప్పారు. గ్రామాల్లో పెద్ద మనుషు లు నిర్వహించే పంచాయితీలు చట్టవిరుద్ధమన్నారు. సామాజిక అంతరాలు తగ్గినపుడే సమసమాజ నిర్మాణం సాధ్యమని అభిప్రాయపడ్డారు.

మహిళ సంఘాలకు చెక్కుల పంపిణీ
డీఆర్టీఏ పరిధిలోగల రాజరాజేశ్వరీ జిల్లా సమాఖ్య సభ్యులకు 5కోట్లు, సిరిసిల్ల పట్టణ సమాఖ్య-75 మహి ళా సంఘాలకు 5 కోట్లు, స్త్రీ నిధి ద్వారా 1,256 మహిళా సంఘాలకు 5కోట్లు, వేములవాడలోని ఉమా మహేశ్వర పట్టణ సమాఖ్య సభ్యులకు 2 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను జడ్జి ప్రియదర్శిని బాధ్యులకు అందించారు. జిల్లాలో 52మంది దివ్యాంగులకు సదరమ్‌ ధ్రువీకరణ పత్రాలు, కులాంతర వివాహాలు చేసుకున్న ఐదు జంటలకు 2.50లక్షల బాం డ్‌ను, అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ కార్డులు, ముగ్గు రు దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు అందించారు. కార్యక్రమంలో సిరిసిల్ల 9వ అదనపు జిల్లా జడ్జి ఎం జాన్సన్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి సుజయ్‌, ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, సిరిసిల్ల,వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, శ్యాంసుందర్‌రావు, సిరిసిల్ల, వేములవాడ బార్‌ అసోషయేషన్ల అధ్యక్షులు వసంతం, పిట్టల భూమేశ్‌, సిరిసిల్ల సినియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలేఖ, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌజన్య, వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి వినిల్‌కుమార్‌ న్యాయవాదులు ఆడెపు వేణు, శ్రీనివాస్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement