e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home కరీంనగర్ విజయగర్జనను విజయవంతం చేద్దాం

విజయగర్జనను విజయవంతం చేద్దాం

మహిళలను భాగస్వామ్యం చేద్దాం
టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చిక్కాల రామారావు
తంగళ్లపల్లి మండల పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం

సిరిసిల్ల రూరల్‌, అక్టోబర్‌ 22: టీఆర్‌ఎస్‌ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, వరంగల్‌లో నవంబర్‌ 15న నిర్వహించనున్న విజయగర్జన బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేద్దామని పార్టీ సీనియర్‌ నేత, సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో శుక్రవారం ఆయన మండల పార్టీ కార్యకర్తలతో అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ, విజయగర్జన సభ సందర్భంగా ప్రతి గ్రామానికీ బస్సు వస్తుందని, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ నేత లు సమన్వయంతో ప్రజలను తరలించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 20వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం ఉంటుందని, పదవులు రానివారు ఆందోళన చెందవద్దన్నారు. నూ తన మండల కార్యవర్గం, అనుబంధ సంఘాలు, గ్రామ కమిటీల అధ్యక్షులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు, ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. విజయగర్జనకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని సెస్‌ చైర్మన్‌ మాజీ దోర్నాల లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ పుర్మాణి మం జుల, ఎంపీపీ పడిగెల మానస కోరారు. అంతకుముందు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పార్టీ నేతలు జంగపల్లి శ్రీనివాస్‌, యేముల వెంకటేశం, సాయబ్‌,శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ,రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తర్వాత టీఆర్‌ఎస్‌ మండల నూతన కార్యవర్గం, అనుబంధ సంఘాలు, గ్రామశాఖ అధ్యక్షులను సన్మానించారు. ఇక్కడ సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్‌ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్‌, కోడూరి భాస్కర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ జంగిటి అంజ య్య, సర్పంచుల ఫోరం జిల్లా, మండలాధ్యక్షులు మాట్ల మధు, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ కొమ్మెటి రాజిరెడ్డి, నేతలు వేణుగోపాల్‌రావు, గనప మదన్‌రెడ్డి, మోర నిర్మల, అవదూత మహేందర్‌, సంజీవ్‌, రషీద్‌, అర్కుటి మహేశ్‌, మహిమల మోహన్‌రెడ్డి, అంకారపు అనిత, సాహేదాబేగం, గనన శివజ్యోతి ఉన్నారు.
నేడు కార్యకర్తల సమావేశం
ఇల్లంతకుంట, అక్టోబర్‌ 22: మండల కేంద్రంలోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో శనివారం నిర్వహించే టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయా లని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మీడి యా ఇన్‌చార్జి మీసరగండ్ల అనిల్‌ శుక్రవారం ఒక ప్రకట నలో పేరొన్నారు. విజయగర్జనను సభను విజయవంతం చేసేందుకు గాను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆదేశాల మేరకు కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి నట్లు తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement