గులాబీ గూటికి బీజేపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్‌తో సహా 50మంది
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
జమ్మికుంట, ఆగస్టు 21: టీఆర్ఎస్లోకి పలు పార్టీలకు చెందిన నాయకుల చేరికలు జోరందుకున్నాయి. శనివారం రాత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో కొత్తపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ దేశిని శ్రీనివాస్, మాల మహానాడు మండలాధ్యక్షుడు రామ్ రాజబాబుతో సహా 50మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు వరంగల్ శివనగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన ఎమ్మెల్యే, పార్టీలోకి ఆహ్వానిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నాయకులు గులాబీ కండువా కప్పుకొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా, కొత్తగా పార్టీలో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ కోసం పనిచేస్తామని, వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ శ్రీనివాస్, కిశోర్, దేవరాజ్, సురేశ్, జీవన్, షర్ఫొద్దీన్, తిరుపతి, వెంకటమల్లు, సంపత్, నరేశ్, నరసింహా, రాజేశం, నాని, ప్రమోద్, భద్రయ్య, రాకేశ్, బబ్లూ, తదితరులతో పాటు కౌన్సిలర్ వీరన్న, నాయకులు కోటి, మధు, సలీం ఉన్నారు.
టీఆర్ఎస్కు ప్ల్లంబర్స్ అసోసియేషన్ మద్దతు
జమ్మికుంట ప్లంబర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. శనివారం రాత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను ఆయన నివాసంలో ప్లంబర్స్ అసోసియేషన్ 85మంది సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్కే మద్దతునిస్తున్నామంటూ హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కోసమే పనిచేస్తామని ప్రతినబూనారు. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొరండ్ల ప్రకాశ్, సెక్రటరీ వడ్లూరి రమేశ్, నాయకులు రాజు, రంజిత్ తదితరులున్నారు.