జడ్పీటీసీ పురుమల్ల లలిత
ఘనంగా ఒగ్గుకథా మహోత్సవం
కరీంనగర్ రూరల్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ఒగ్గు కళాకారులకు ప్రత్యేక గుర్తింపునిస్తున్నదని జడ్పీటీసీ పురుమల్ల లలిత అన్నారు. బొమ్మకల్ గ్రామంలోని కొచ్చ గుట్ట మల్లికార్జునస్వామి దేవాలయంలో ఐదు రోజులుగా అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. చివరి రోజు శనివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పర్యవేక్షణలో సాయిల శివయ్య, సాయిల మల్లేశం ఆధ్వర్యంలో గూగుల్ మీట్ ద్వారా ఒగ్గుకథ ప్రదర్శన నిర్వహించారు. చొప్పదండి, కరీంనగర్ మండలంలోని నగునూర్, చెర్లభూత్కూర్ గ్రామాల ఒగ్గు కళాకారులు ప్రదర్శనలిచ్చారు. కరీంనగర్ జడ్పీటీసీ పురుమల్ల లలిత, చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, చెర్లభూత్కూర్ సర్పంచ్ దబ్బేట రమణారెడ్డి, గోపాల్పూర్ సర్పంచ్ ఊరడి మంజులామల్లారెడ్డి, జూబ్లీనగర్ సర్పంచ్ రుద్ర భారతీరాము, నగునూర్ ఉపసర్పంచ్ దామరపెల్లి దామోదర్‌రెడ్డి, కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, డైరెక్టర్ సాయిల మహేందర్, కరీంనగర్ నగర పాలక 9వ డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్,11 వ డివిజన్ కార్పొరేటర్ నర్మదానర్సయ్య, 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవి, స్థానిక కళాకారులను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్థానిక ఒగ్గు కళాకారులను ప్రోత్సహించేందకు పలు కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒగ్గు కళాకారులతో కరోనా కట్టడికి ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించి కళాకారులను, ఆదుకోవడం తోపాటు, ప్రజల్లో కరోనా పైన అవగాహన కల్పించిందని తెలిపారు. జడ్పీటీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కళాకారులకు ప్రోత్సాహకం అందిస్తున్నదని తెలిపారు. చొప్పదండి ఎంపీపీ రవీందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఒగ్గు కళాకారులు ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ దాది సుధాకర్, సాయిల శివయ్య బృందం, ఈరు ఓదెలు, సాయిల కనకయ్య, రవి, కాల్వ మల్లేశం, కాల్వ అశోక్, శంకర్, తిరుపతి, కచ్చు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.