ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Karimnagar - Jan 17, 2021 , 03:23:52

నగర శివారుల అభివృద్ధిపై బల్దియా దృష్టి

నగర శివారుల అభివృద్ధిపై బల్దియా దృష్టి

  • అల్గునూర్‌, రేకుర్తి వంతెనల వద్ద సుందరీకరణ
  • త్వరలో పనులు చేపట్టేందుకు చర్యలు
  • ఇప్పటికే పలు డిజైన్ల పరిశీలన

కార్పొరేషన్‌, జనవరి 16: నగర శివారు ప్రాంతాల అభివృద్ధిపై బల్దియా దృష్టిసారించింది. ఇప్పటికే నగరానికి నలువైపులా స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్‌ వై సునీల్‌రావు నిర్ణయించారు. వీటికి సంబంధించి వివిధ కన్సల్టెన్సీలను సంప్రదించి డిజైన్ల తయారీలో నిమగ్నమయ్యారు. అలాగే, నగరానికి వచ్చే చౌరస్తాలను కూడా సుందరీకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా అల్గునూర్‌ మానేరు వంతెనలు, రేకుర్తి వంతెనల ప్రాంతాల్లో సుందరీకరణ చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. 

పలు డిజైన్ల పరిశీలన

ఈ రెండు ప్రాంతాల్లోనూ రాకపోకలకు రెండు వంతెనల చొప్పున ఉన్నాయి. ఈ రెండు వంతెనల మధ్యలో కొంత స్థలం ఉండగా...  పిచ్చిమొక్కలు, ఇతర చెట్లతో కళావిహీనంగా కనిపిస్తున్నది. దీంతో ఈ ప్రాంతాలను సుందరీకరణ చేయాలని మేయర్‌ వై సునీల్‌రావు సమాలోచనలు చేశారు. రేకుర్తిలో రెండు వంతెనల మధ్యలో అటు ఇటు, అలాగే, అల్గునూర్‌ వంతెనల వద్ద కూడా అటు ఇటు అందమైన పూల మొక్కలు, గ్రీనరీ కనిపించేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అల్గునూర్‌ చౌరస్తాలో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. మానేరు వంతెనపై కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే పలు డిజైన్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. రేకుర్తి వంతెన వద్ద  పలు డిజైన్లను పరిశీలించగా ఒక డిజైన్‌కు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ పనులు పూర్తయితే నగర ఆరంభంలోనే సుందరీకరణ కనిపించనుంది. 


VIDEOS

logo