VD12 | ఇటీవలే పరశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వెంటనే తన కొత్త ప్రాజెక్ట్ (VD12) పైనే ఫోకస్ పెట్టాడు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని జెర్సీ ఫేంగౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ షురూ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం విజయ్ దేవరకొండ అండ్ టీం వైజాగ్‌కు పయనం కానుందట. ఏప్రిల్ 28 నుంచి నెక్ట్స్ షెడ్యూల్ షురూ కానుండగా.. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనున్నట్టు సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, మమతాబైజు పేర్లను హీరోయిన్లుగా పరిశీలిస్తున్నారని ఇన్సైడ్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పాపులర్ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ పనిచేయబోతున్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతోపాటు అంగమలై డైరీస్, జల్లికట్టు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేశారు గిరీష్ గంగాధరన్ .
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023