Balakrishan Nomination | హిందూపురంలో నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ
Balakrishan Nomination | ఏపీలోని హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి, సినీనటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు.
అమరావతి : ఏపీలోని హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి, సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) నామినేషన్ వేశారు. మూడోసారి హిందూపురం (Hindupuram) నుంచి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటి నుంచి భార్యతో కలిసి నామినేషన్ (Nomination )కు బయలు దేరారు.
ఈ సందర్భంగా ఆర్వో కార్యాలయం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్వో కార్యాలయంలో ఎన్నికల అధికారికి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఇచ్చిన మాటకు కట్టుబడుతారనే నమ్మకంతో ప్రజలు తనపై అభిమానం పెంచుకుంటున్నారని తెలిపారు.
నాన్న ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, అన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, మురికి కాలువలు నిర్మించానని వెల్లడించారు. కరోనా సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశానని పేర్కొన్నారు. అన్న క్యాంటిన్ ద్వారా ఉచితంగా అన్నదానం చేశామని బాలకృష్ణ వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

