double murder | మహిళను హత్య చేసిన వ్యక్తి.. అతడ్ని చంపిన మృతురాలి తల్లి
double murder | తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
బెంగళూరు: తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు (double murder) స్థానికంగా కలకలం రేపాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల అనూష, 44 ఏళ్ల సురేష్ మధ్య ఐదేళ్లుగా పరిచయం ఉంది. అయితే తనను దూరం పెడుతున్న అనూషపై సురేష్ పగ పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం పార్కులో కలుసుకుందామని ఆమెకు ఫోన్ చేశాడు.
కాగా, ఒక వ్యక్తిని పార్కులో కలిసి ఐదు నిమిషాల్లో తిరిగి వస్తానని అనూష తన తల్లికి చెప్పింది. జయనగర్ ప్రాంతంలోని పార్కుకు ఆమె బయలుదేరింది. అనుమానించిన తల్లి కొంత సేపటి తర్వాత అనూషను అనుసరించింది.
మరోవైపు పార్కులో వేచి ఉన్న సురేష్ అక్కడకు వచ్చిన అనూషను కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పుడే పార్కుకు చేరుకున్న అనూష తల్లి ఇది చూసి ఆగ్రహంతో రగిలిపోయింది. పెద్ద రాయితో సురేష్ తలపై కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనూషను ఆసుపత్రికి తరలించగా ఆమె కూడా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జంట హత్యలపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

