గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Sep 03, 2020 , 01:46:03

రెండో రోజూ జేఈఈ మెయిన్స్‌

రెండో రోజూ జేఈఈ మెయిన్స్‌

  • lవాగేశ్వరీ, విట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీబీటీ పరీక్ష
  • l1,170 మందికి ఏర్పాట్లు
  • l1058 మంది హాజరు
  • l112 మంది గైర్హాజరు

తిమ్మాపూర్‌ : దేశ వ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు బుధవారం కొనసాగాయి. మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని డిజిటల్‌ అయాన్‌ జోన్‌, వాగేశ్వరీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కరీంనగర్‌లోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజికల్‌ సైన్సెస్‌ (విట్స్‌)లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. మొత్తం మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం కలిపి 1,170 మందికి ఏర్పాట్లు చేయగా 1058 మంది హాజరు కాగా, 112 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని వాగేశ్వరీలోని ఆయాన్‌ డిజిటల్‌ సెంటర్‌లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో 728 మందికి 653 మంది హాజరు కాగా, 75 మంది గైర్హాజరయ్యారు. వాగేశ్వరీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో రెండు సెషన్లలో 280 మందికి గాను 260 మంది హాజరుకాగా, 20 మంది గైర్హాజరయ్యారు. అలాగే కరీంనగర్‌లోని విట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో రెండు సెషన్లలో 162 మందికి 145 మంది హాజరుకాగా, 17 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రం ఆవరణలో శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. పరీక్షకు ముందు విద్యార్థులను గంటన్నర ముందు లోనికి అనుమతించగా, కేంద్రం వద్ద మాస్కులు పంపిణీ చేశారు. లోనికి వెళ్లే ముందు విద్యార్థుల హాల్‌ టికెట్ల బార్‌ కోడ్‌ స్కాన్‌ చేయడంతోపాటు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్షకు ముందు, తర్వాత పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్‌ చేశారు. పరీక్ష కేంద్రాలను సిటీ కో ఆర్డినేటర్‌ లలితాకుమారి పర్యవేక్షించారు. 


logo