జగిత్యాల విద్యానగర్, డిసెంబర్ 17: కోరుట్ల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీలో సానియా మాహిన్ 413మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. బైపీసీలో డింగరి లక్ష్మి 407 మార్కులు, కే శ్రీనిధి 407 సాధించినట్లు పేర్కొన్నారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, అధ్యాపకులు అభినందించారు.
మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ మోతె శివరామకృష్ణ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులతో ధ్యానం చేయించారు. కార్యక్రమంలో ఉపన్యాసకులు అత్తినేని శ్రీనివాస్, మహ్మద్ నవాబ్, వేనెపెల్లి సంధ్య, యాముల శ్రీనివాస్, బాసాని నరేశ్, గగడం రచన, దమ్మయ్యగారి శ్రీకాంత్, కేశవేని శ్రీనివాస్, నగునూరి పూర్ణిమ, మహ్మద్ నజీర్, ఆరె రాము, అక్తర్ భాను తదితరులు పాల్గొన్నారు.
గొల్లపల్లి, డిసెంబర్ 17: గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ విభాగంలో నక్క వర్ణ 409మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచిందన్నారు. ఎంపీసీ విభాగంలో 83శాతం మంది విద్యార్థులు, బైపీసీ విభాగంలో 70శాతం మంది, ఆర్ట్స్ గ్రూపులో 34శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తరగతుల ప్రత్యక్ష నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గిందని, రాబోయే కాలంలో ఉత్తీర్ణత శాతం మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కళాశాల టాపర్గా నిలిచిన నక్క వర్ణను ప్రిన్సిపాల్ మల్లయ్య, అధ్యాపకులు అభినందించారు.