e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home కరీంనగర్ ఈటలకు పేదలపై ప్రేమలేదు

ఈటలకు పేదలపై ప్రేమలేదు

దయాదాక్షిణ్యాలు అసలే లేవు
పదవులను స్వార్థ కోసం వాడుకున్నడు
టీఆర్‌ఎస్‌ నిరుపేదల పార్టీ
గెల్లును గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటం
పేదలందరికీ దళితబంధు వంటి పథకం కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నరు
బండి సంజయ్‌ ఎంపీగా గెలిచి ఏం చేశాడు
రేపు ఈటల గెలిస్తే ఏం చేస్తాడు
అధికార పార్టీని గెలిపించుకుంటేనే హుజూరాబాద్‌ ప్రజలకు లక్ష్మి
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు
ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ఎరుకలు, వాల్మీకి బోయల ఆత్మీయ సమ్మేళనాలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 17 (నమస్తే తెలంగాణ)/ఇల్లందకుంట రూరల్‌ : బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌కు పేదలపై ప్రేమ, దయాదాక్షిణ్యాలు లేవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో వేరు వేరుగా నిర్వహించిన ఎరుకల, వాల్మీకి బోయ కులస్తుల ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన మాట్లాడారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఈటల పేదల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పేదల మీద ప్రేమ ఉంటే ఐదేండ్ల కింద సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నాలుగు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లలో ఒక్కటైనా నిర్మించి ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించలేని ఏకైన మంత్రిగా ఈటల నిలిచి పోయారని గుర్తు చేశారు. ఆయన చేయలేని పనులు తాము చేస్తామని, గెల్లు శ్రీనివాస్‌ను ఆశీర్వదిస్తే పేదల రుణం తీర్చుకుంటామని, పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా రెండున్నరేండ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, ప్రతి నెలకో, పదిహేను రోజులకో ఒకసారి హుజూరాబాద్‌కు వచ్చి, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని స్పష్టం చేశారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇక్కడి ప్రజల కోసం ఇప్పటి వరకు అణా పైసా పని చేయలేదని, రేపు ఈటల గెలిచినా ఇలాంటి పరిస్థితే హుజూరాబాద్‌ ప్రజలకు ఎదురవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడం మినహా దేశానికి చేసిందేమీ లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

తీర్మానం చేసి పంపితే తిప్పి పంపారు..
వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి పంపితే కేంద్రం తిరిగి పంపిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బోయలను ఎస్టీల్లో చేర్చుతామని ఈటల హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. ఈటల అబద్ధాలు చెబుతూ ఎన్నికలో గెలవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అంటే సంక్షేమమని, బీజేపీ అంటే ధరల సంక్షోభమని చెప్పారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే హుజూరాబాద్‌ నియోజవర్గానికి లక్ష్మీదేవి వస్తుందని, ఈటల గెలిస్తే ఆయనకు పదవి మాత్రమే వస్తుందని తెలిపారు. ఈ ఆత్మీయ సభల్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారయణ, రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, నాయకులు కెమసారం ప్రవీణ్‌, కుతాడి రాజయ్య, కూరాకుల సాయి, కుతాడి కుమారస్వామి, రమేశ్‌, దేవరాజు, కెమసారం తిరుపతి, పల్లకొండ సుధాకర్‌, సార తిరుపతి, మనుపాటి ఓదెలు, రేవెల్లి తిరుపతి, కెత్రి నాగరాజు, తిరుపతి మొండయ్య, కట్ట రాజేందర్‌, తిరుపతి సమ్మయ్య, కెమ్మసారం బక్కయ్యతోపాటు వాల్మీకి బోయ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, కుల సంఘాల నాయకులు ఉజ్జేతుల కృష్ణమూర్తి, బోయ రాహుల్‌, పెనుకుల కృష్ణమూర్తి, చందబోయిన రవి, చంద్రయ్య, రాజు, శంకర్‌, మల్లేష్‌, సారంగం, ముస్కే రాము పాల్గొన్నారు.

ఒక్క ఓటు జాతికి న్యాయం చేస్తది
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో మనం వేసే ఒక్క ఓటు వాల్మీకి బోయ జాతికి న్యాయం చేస్తది. బోయ కులస్తులు ఆలోచించి కారు గుర్తుకు ఓటెయ్యాలి. వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి పంపడం బాధాకరం. కేవలం సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే మనకు న్యాయం జరుగుతది. దళితబంధులాగా వాల్మీకి బోయలకు పథకం పెట్టాలని సీఎం కేసీఆర్‌ను కోరుత.
-గట్టు తిమ్మప్ప, వాల్మీకి బోయ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌

టీఆర్‌ఎస్‌తోనే ఎరుకలకు మంచి రోజులు
టీఆర్‌ఎస్‌తోనే ఎరుకల కులస్తులకు మంచి రోజులు వచ్చాయి. గతంలో ఏ పాలక ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకోలేదు. మనలో మార్పు రావాలి. ఆలోచన చేసి ఓటు వెయ్యాలి. మన సమస్య లు తీరాలంటే తప్పక టీఆర్‌ఎస్‌ను ఆదరించాలి. సీఎం కేసీఆర్‌ మన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నరు. యాదవులకు గొర్రె లు ఇచ్చినట్లుగానే ఎరుకలకు కూడా పందు ల పెంపకానికి సీఎం సహకరిస్తామన్నరు. గెల్లు శ్రీనివాస్‌కు ఓటేసి గెలిపించాలని కులస్తులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

  • కుర్ర సత్యనారాయణ, కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే, ఎరుకల సంఘం రాష్ట్ర నాయకుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement