శాలపల్లి-ఇందిరానగర్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు, దళితులు
కార్పొరేషన్, ఆగస్టు 16: హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన దళితబంధు ప్రారంభోత్సవ సభకు నగరానికి చెందిన గంగుల కమలాకర్ యువసేన నాయకుల ఆధ్వర్యంలో యువకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. దళిత బంధు పథకం కూడా విజయవంతంగా సాగుతుందన్నారు. తరలివెళ్లిన వారిలో యువసేన అధ్యక్షుడు మొగిలోజి వెంకట్, నాయకులు సర్వర్, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, కలకుంట్ల వరుణ్‌రావు, శ్రావణ్‌కుమార్, వరుణ్‌కుమార్, గాండ్ల రమేశ్, ప్రదీప్, శ్రీహరి, రమేశ్, భరత్, జమీల్, సంపత్, వినీత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, ఆగస్టు 16: శాలపల్లి-ఇందిరానగర్‌లో నిర్వహించిన దళితబంధు ప్రారంభోత్సవ సభకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో చొప్పదండి పట్టణంతో పాటు మండలంలోని దళితులు, టీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. దళితుల అభ్యున్నతి కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
గంగాధర, ఆగస్టు 16: శాలపల్లి-ఇందిరానగర్‌లో ఏర్పాటు చేసిన దళితబంధు ప్రారంభోత్సవ సభకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళితులు తరలివెళ్లారు. సుమారు 150 మంది దళితులతో పాటు టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. దళిత బంధు పథకాన్ని అవగాహన చేసుకొని మండలంలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని నాయకులు తెలిపారు.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 16: మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, దళితులు దళిత బంధు ప్రారంభోత్సవ సభకు తరలివెళ్లారు. బస్సులు, వాహనాల్లో వెళ్లగా, వాహన శ్రేణిని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.