ధాన్యం తూకంలో గోల్మాల్
ధాన్యం తూకంలో ఓ రైస్‌మిల్లు నిర్వాహకుడు గోల్మాల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, స్థానిక రైతుల కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన ఎదుగట్ల మహేశ్ రెండ్రోజుల కింద వరికోశాడు. కోసింది కోసినట్లే ధాన్యాన్ని విక్రయించేందుకు శుక్రవారం మర్తనపేట గ్రామంలోని సరస్వతీ రైస్ మిల్లుకు పంపించాడు.
- 16క్వింటాళ్లు తక్కువ చూపిన రైస్‌మిల్లు నిర్వాహకుడు
- రైతుకు అనుమానం వచ్చి నిలదీయడంతో తప్పు ఒప్పుకున్న వైనం
- ఆలస్యంగా వెలుగులోకి
కోనరావుపేట, ఏప్రిల్ 20: ధాన్యం తూకంలో ఓ రైస్‌మిల్లు నిర్వాహకుడు గోల్మాల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, స్థానిక రైతుల కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన ఎదుగట్ల మహేశ్ రెండ్రోజుల కింద వరికోశాడు. కోసింది కోసినట్లే ధాన్యాన్ని విక్రయించేందుకు శుక్రవారం మర్తనపేట గ్రామంలోని సరస్వతీ రైస్ మిల్లుకు పంపించాడు. మొత్తం నాలుగు ట్రాక్టర్ల లోడ్ తరలించాడు. రైతు లెక్క ప్రకారం మొత్తం ధాన్యం 65 క్వింటాళ్ల తూకం రావాల్సి ఉంది. అయితే ఒక్కో ట్రాక్టర్ లోడ్ 17 క్వింటాళ్ల చొప్పున మొదటి రెండు లోడ్లు వెయిట్ రాగా, తర్వాత లోడ్ 10 క్వింటాళ్లు, చివరి లోడ్ కేవలం 5 క్వింటాళ్లు.. మొత్తంగా 49 క్వింటాళ్లు మాత్రమే తూకం వచ్చిం ది. ఆ మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌కు ట్రక్ షీట్లు ఇచ్చి పంపించగా, వాటిని చూసి రైతు కంగుతిన్నాడు.
ప్రతి లోడ్‌లో ధాన్యాన్ని ఒకే మొత్తంలో పంపిస్తే తూకంలో తేడాలు ఎలా వచ్చాయని సదరు రైతు మరికొంత మంది రైతులతో కలిసి మిల్లు నిర్వాహకుడి వద్దకు వెళ్లి ప్రశ్నించారు. దీంతో చివరి రెండు లోడ్లలో ధాన్యం తక్కువగా వచ్చిందని, వచ్చింది వచ్చినట్లే తూకం వేసి ట్రక్ షీట్లు ఇచ్చానని మిల్లు నిర్వాహకుడు దురుసుగా మాట్లాడాడు. గోల్మాల్ ఎక్కడ జరిగిందో..? తెలుసుకునేందుకు శనివారం ఉదయం మర్తనపేట గ్రామ చౌరస్తాలో ఉన్న సీసీ పుటేజీని రైతులు పరిశీలించారు. అయితే ట్రాక్టర్ లోడ్‌లో ఎక్కడా తేడా లేదని, ఫుల్‌గానే ధాన్యం వచ్చినట్లు గుర్తించారు. నిర్వాహకుడి వద్దకు వెళ్లి గొడవ చేయడంతో అతడు సైతం పుటేజీ పరిశీలించి జరిగిన తప్పుఒప్పుకున్నాడు. మొత్తం 65 క్వింటాళ్ల ధాన్యాన్ని లెక్క చూపాడు. జరిగిన నష్టాన్ని భర్తీ చేశాడు. అయితే ఈ విషయం బయటికి రావడంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ తామూ ఇలాగే మోసపోయి ఉంటామంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

