ఇల్లందకుంట, అక్టోబర్ 14: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. ఈటల రాజేందర్ ఏనాడూ పేదల గురించి పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి, గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జనగాం జడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, నాయకులు సరిగొమ్ముల వెంకటేశ్, రాంస్వరణ్‌రెడ్డి, కుమార్, తిరుపతి, వేణు, విక్రమ్, కుమార్, కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.