గంగాధర, డిసెంబర్ 12: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామానికి చెందిన పోచంపల్లి మల్లయ్య ఇటీవల ప్రమాదంలో మృతి చెందారు. కాగా, బాధిత కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లయ్య కుటుంబానికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున పార్టీ తరఫున రూ. 2 లక్షల బీమా సొమ్ము అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచ్ రేండ్ల జమున, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ ఉప్పుల గంగాధర్, మాజీ సర్పంచ్ రేండ్ల రాజిరెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, పెంచాల చందు, రేండ్ల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
బూరుగుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను టీఆర్ఎస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలుపొంది మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, బీసీ సెల్ మండలాధ్యక్షుడు ఇప్పలపెల్లి మధు, సర్పంచ్ మాల చంద్రయ్య, ఎంపీటీసీ మధుసూదన్‌రెడ్డి, నాయకులు తిరుపతిగౌడ్, నగేశ్, అనంతరెడ్డి పాల్గొన్నారు.