టీఎన్జీవోస్ నీటి పారుదల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్
ఉద్యోగ సంఘాల నాయకులు,ఉద్యోగుల ఆధ్వర్యంలో సన్మానం
కొత్తపల్లి, డిసెంబర్ 10: నీటి పారుదల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని టీఎన్జీవోస్ నీటి పారుదల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి టీఎన్జీవోస్ కార్యాలయంలో నీటిపారుదల ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గానికి గురువారం ఎన్నికలు నిర్వహించగా మారం జగదీశ్వర్ నాలుగోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, శుక్రవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయనకు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీఎన్జీవోస్ భవనంలో ఆయనను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈసందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, కొత్త జోనల్ విధానాన్ని ఇరిగేషన్ విభాగానికి వర్తింపజేయకుండా ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చిస్తామన్నారు. అలాగే, ప్రతి ఉద్యోగి సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన ఎన్నికకు సహకరించిన టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, నీటి పారుదల శాఖ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి కిరణ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మీందర్‌సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్, కార్యదర్శి నేరేళ్ల కిషన్, ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజిత్‌సింగ్, నాయకురాళ్లు శారద, సబిత, సునీత, కనకదుర్గ, విరోనిక, శైలజ, విజయలక్ష్మి, శివాని, స్వరూప, రమ, జిల్లా నాయకులు రాజేశ్వర్‌రావు, రమేశ్‌గౌడ్, ప్రసాద్‌రెడ్డి, పోలు కిషన్, నాగరాజు, పవన్‌కుమార్, మురళీకృష్ణ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.