తెలంగాణచౌక్, నవంబర్10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆర్థికాభివృద్ధిలో ప్రతి ఉద్యోగి పాలు పంచుకోవాలని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీలోని అన్ని విభాగాల ఉద్యోగులకు సూచించారు. హైదరాబాద్లోని సంస్థ ప్రధా న కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్మికులు ప్రయాణి కులతో మర్యాదగా మసలుకోవాలని సూచించారు. సంస్థను లాభాల బాటలోకి తీసుకు రావాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉన్నదన్నారు. ము ఖ్యంగా ఆర్టీసీ రవాణా సంస్థలో ము ఖ్య భూమిక పోషించే డైవర్లు, కండక్టర్లు విధి నిర్వహణలో శ్రద్ధ చూపాలన్నారు. వినియోదారులే సంస్థకు దేవుళ్లు అనే విషయాన్ని గుర్తెరిగి పనిచేయాలని నిర్దేశించా రు. ప్రతి డైవర్, కండక్టరు ఒక్కో ప్రయాణికుడిని అదనంగా బస్సు ఎక్కించగలిగితే సంస్థకు రెండు శాతం ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందన్నారు. ప్రతి ట్రిప్పుకు ఐదుగురి ప్రయాణికులను అదనం గా తీసుకుంటే సంస్థ ఇప్పుడు ఉన్న నష్టాల నుంచి గట్టెక్కుతుందని తెలిపారు. డ్రైవర్లు ఆరో గ్యం విషయంలో శ్రద్ధ కనబరచాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం అన్ని డిపోల అధికారులు. డ్రైవర్లు, కండక్టర్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కార్యక్రమంలో కరీంనగర్ ఆర్ఎం శ్రీధర్, డీవీఎం రవిశంకర్ రెడ్డి, డిపో మేనేజర్లు అర్పిత, మల్లేశం తదితరులు ఉన్నారు.