మెట్పల్లి/కోరుట్ల, అక్టోబర్30: కోరుట్ల నియోజకర్గంలో బీఆర్ఎస్ బలం, బలగం పెరుగుతున్నది. పార్టీలో చేరిక జోష్ కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై, అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో నిత్యం పెద్ద సంఖ్యలో నాయకులు చేరిపోతుండగా, ప్రతిపక్ష పార్టీలకు రోజుకో షాక్ తగులుతున్నది. ప్రధానంగా కాంగ్రెస్ ఖాళీ అయిపోతున్నది. సోమవారం మల్లాపూర్ మండలం రేగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దండికే బుచ్చిరాములు, నాయకులు దండ్ల శ్రీనివాస్, దువాక పవన్, ఆరేళ్ల దేవదాస్, ఆరేళ్ల రామకృష్ణ, రంపేకోత రాజేశం సహా నాయకులు, కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. కష్టపడి పనిచేసే ప్రతికార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టో హామీలను ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేయాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుందేళ్ల నర్సయ్య, మాజీ సర్పంచ్ రంగు రామాగౌడ్, బీఆర్ఎస్ మండల శాఖ ఉపాధ్యక్షులు సురకంటి తిరుపతిరెడ్డి, జాగృతి యువజన విభా గం జగిత్యాల జిల్లా నాయకులు గణవేని మల్లేశ్‌యాదవ్, రేగుంట బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కుక్కుదు అశోక్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కు మద్దతు పెరుగుతున్నది. సోమవారం కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన 100 మంది యువకులు జై కొట్టారు. అనంతరం డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరుతున్నట్లు యువకులు తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, నాయకులు బోధనపు హరీష్, జంగ విష్ణు, శ్రీనివాస్, తవుట మహేందర్, అరవింద్, అనిల్, వనతడుపుల రాజ్ కుమార్, మనోజ్ కృష్ణ, మధు, ఎర్ర అనిల్, రాహుల్, వనతడుపుల ఉదయ్, వినయ్, శేఖర్, రంగుల నవీన్, బొయ్య మధుకుమార్, బొయ్య దీపక్, మధు, వనతడుపుల శేఖర్, జంగ సురేష్, తాడు నితిన్, కొంతం శేఖర్, తవుట రాజశేఖర్, ఇలియాస్, తన్వీర్, యూనిస్, ఎర్ర సునీల్ తదితరులు పాల్గొన్నారు.