కోల్‌సిటీ, ఆగస్టు 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దేశానికి ముప్పు పొంచి ఉందని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు ‘సేవ్ ఇండియా’ పేరుతో తలపెట్టిన దేశ వ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలనే నూతన చట్టాలు తీసుకువస్తుందని చెప్పారు. బొగ్గు రంగ పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను చడీ చప్పుడు లేకుం డా నాలుగు కోడ్లుగా మార్చిందని ఆరోపించారు. కార్యక్రమాల్లో నాయకులు వేల్పుల కుమారస్వామి, నరేశ్, శనిగల శ్రీనివాస్, బైరం శంకర్, రాజేందర్, ఎంఏ గౌస్, మెండె శ్రీనివాస్, నర్సయ్య, నాగమణి, ఉపేందర్, రాజమొగిలి, ఇప్పలపల్లి సతీశ్, అన్నం శ్రీనివాస్, వెంకన్న, తోకల రమేశ్, బాబు, కొంరయ్య, మొండయ్య తదితరులున్నారు.
పెద్దపల్లిటౌన్, ఆగస్టు 9: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సేవ్ ఇండియా ఆం దోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు ఎరవల్లి ముత్యంరావు, కే విశ్వనాథ్, ఆకుల వెంకన్న మాట్లాడారు. ఇక్కడ నాయకులు వెంకటస్వామి, చంద్రయ్య, రమేశ్, ఆంజనేయులు, రాజు, పూసల రమేశ్, క్యాదాసి లింగమూర్తి, కొల్లూరి మల్లేశ్, పెరుక రాజమల్లు పాల్గొన్నారు.
జ్యోతినగర్, ఆగస్టు 9: ఎన్టీపీసీ లేబర్గేట్లో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ విధానాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం మాట్లాడారు. ఎన్టీపీసీలో కార్మిక సంఘాలతో యాజమాన్యం చేసుకున్న అగ్రిమెంట్‌లోని ప్రమోషన్ పాలసీ, వారసత్వ ఉద్యోగాలను అమ లు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ యూనియన్ల నాయకులు ముత్యం రావు, నాంసాని శంకర్, లక్ష్మారెడ్డి, రామాచారి, నరేశ్, చిలుక శంకర్, శ్రీనివాస్, నాగభూషణం, గుండు రాజయ్య, లక్ష్మణ్, సత్యం, రాఘవరెడ్డి, మల్లేశ్, యాకుబ్, రాజ్‌కుమార్, నారాయణరెడ్డి, సాంబయ్య, భూమయ్య, నర్సయ్య, రమేశ్, రవి ఉన్నారు. అలాగే ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సీఐటీయూ ఎన్టీపీసీ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండు కనకయ్య, కాదశి మల్లేశ్, యాకుబ్, కృష్ణారెడ్డి, శంకరయ్య, గోపాల్‌రెడ్డి, అజయ్, పవన్ ఉన్నారు.
అలాగే రామగుండం రైల్వేస్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సంఘ్ రామగుండం బ్రాంచ్ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే చట్టాలని రద్దు చేయాలని, రైల్వేను కాపాడాలని నినాదాలు చేశారు. ఇక్కడ వీరన్ననాయక్, విజయ్‌కుమార్, శ్రీధర్, రమణాచారి, మురళీమోహన్, సంపత్ కుమార్, లింగమూర్తి, శ్రీనివాస్, అనిల్ కుమార్, అక్బర్, రవి, కిరణ్‌రావు తదితరులున్నారు.
ధర్మారం/ పెద్దపల్లి కమాన్ ఆగస్టు 9: ధర్మారం తహసీల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, అనంతరం తహసీల్దార్‌కు జిల్లా సహాయ కార్యదర్శి బత్తిని సంతోష్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, శ్రీనివాస్, ఆకుల రాజయ్య, మల్లేశ్, నవీన్, రాజయ్య, నర్సయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, ఆగస్టు 9: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు డీటీ శ్రీకాంత్‌కు వినతి పత్రం అందజేశారు. ఇక్కడ నాయకులు కల్లెపెల్లి అశోక్, వేల్పుల భాస్కర్, ఆంజనేయులు, ఆసంపెల్లి బాణయ్య, మానుమండ్ల నర్సింగం, కనకయ్య, ప్రశాంత్, నాగయ్య, ఆనంద్, నర్సయ్య పాల్గొన్నారు.
కమాన్‌పూర్, ఆగస్టు 9: కమాన్‌పూర్ తహసీల్ కార్యాలయంలో డీటీ వినయ్‌కుమార్‌కు సీఐటీయూ జిల్లా సంయుక్త కార్యదర్శి జ్యోతి, అంగన్వాడీ జిల్లా నాయకురాలు మల్యాల భాగ్య వినతి పత్రం అందజేశారు.