గంగాధర, జనవరి 9: మండలంలోని గట్టుభూత్కూర్, నారాయణపూర్, వెంకంపల్లి, కాచిరెడ్డిపల్లి, కురిక్యాల గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు రైతుబంధు ఆవశ్యకతను తెలియజేస్తూ ముగ్గులు వేశారు. రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రైతు బంధు పథకంపై గ్రామస్తులకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. నారాయణపూర్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు పుష్పాభిషేకం చేశారు. గట్టుభూత్కుర్లో ముగ్గుల పోటీల విజేతలకు మొదటి బహుమతి 10 గ్రాముల వెండి, రెండో బహుమతి 5 గ్రాముల వెండి, మూడో బహుమతి రెండు గ్రాముల వెండి అందజేశారు. కార్యక్రమాల్లో మండల వ్యవసాయాధికారి రాజు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సర్పంచులు కంకణాల విజేందర్‌రెడ్డి, ఎండీ నజీర్, ముక్కెర మల్లేశం, జోగు లక్ష్మీరాజం, మేచినేని నవీన్‌రావు, నాయకులు గర్వందుల పరశురాములు, ముద్దం నగేశ్, జాగిరపు ప్రభాకర్‌రెడ్డి, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జనవరి 9: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో రైతు బంధు సంబురాలు నిర్వహించారు. బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు జోజిరెడ్డి, కరీంనగర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు బంధు పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
రైతు గోలి మల్లయ్యను సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ శాలువాతో సన్మానించి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో రైతులు చిందం మల్లయ్య, ఎన్ ఆంజనేయులు, గుండ తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, జక్కినపల్లి శంకర్, కాల్వ మల్లేశంయాదవ్, మద్దెల శ్రీనివాస్, మారుతీశ్వర్, తోట కిరణ్, మల్లేశం, నారాయణ, మల్లేశం పాల్గొన్నారు. చామనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గర్వంద శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్ బోగొండ లక్ష్మి-ఐలయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బుర్ర గంగయ్య, ఎల్లాగౌడ్, పరశురాములు, ప్రసాద్, పూరెల్ల శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి సత్యం, రమేశ్, సంపత్, శ్రీనివాస్, రాజు, మధు, చంద్రయ్య, అనిల్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. నగునూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు తొంటి లక్ష్మయ్య, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ రాంరెడ్డి, సాగర్, బత్తిని రాజాగౌడ్, దిలీప్ గౌడ్, రవితేజ, నెక్పాషా, కిషన్, వరి భద్రయ్య, శ్రీనివాస్ రావు, తాటికొండ మధు, హఫీజ్, మధు, రైతులు పాల్గొన్నారు.