జిల్లాకు చేరిన సద్దుల కానుకలు
రేషన్‌కార్డుల ఆధారంగా 2, 75, 087 అవసరం
పెద్దపల్లి, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): తెలంగాణలో బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ డపడుచులకు కానుకగా ప్రతీ ఏడాది చీరలను అందజేస్తున్నది. అలాగే ఈ ఏడు కూడా అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి విడతగా చీరెలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని పెద్దపల్లి మార్కెట్ యార్డులో నిల్వ చేస్తున్నారు. ఆ హార భద్రత కార్డులు కలిగి ఉన్న 18ఏళ్లు నిండిన వారికి అందజేయనున్నారు. జిల్లాలో 2,22,867 రేషన్‌కార్డుల ఆధారంగా 2,75,087లక్షల మంది మహిళలు ఉన్నారు. కాగా ఇప్పటివరకు మొదటి విడుతలో 1,36000 చీరెలు వచ్చాయి. వీటిని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో భద్రపరిచారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే చీరెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. డీఆర్డీవో, పౌర సరఫరాల విభాగం ఆధ్వర్యంలో వీటి ని మహిళలకు అందించనున్నారు. చీరెల పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా క లెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారి పేర్లు రేషన్ కార్డుల్లో లేకపోవడం తో వారికి చీరలు అందడంలేదు.
ప్రస్తుతం కొత్త కార్డులు మంజూరు చేయడంతో ఈ ఏడు అందరికీ అందనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సారి మరో 22,087మందికి అదనంగా ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా కొత్త కార్డులు మంజూరుకాకపోవడంతో ఇబ్బంది పడ్డ వారందరికీ కొత్త రేషన్ కార్డులు మార్పులు, చేర్పులతో దరఖాస్తు చేసుకున్నవారికి రావడంతో వారికి సైతం చీరలు అందనున్నాయి. బతుకమ్మ చీరలకు పౌర సరఫరాల శాఖ, రేషన్ డీలర్లు, సెర్ప్, మెప్మా, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖల సిబ్బంది, మహిళా సంఘాల సభ్యుల సహకారంతో ఇప్పటి వరకు పంపిణీ సాగుతోంది. రేషన్‌కార్డులో పేరు నమోదు ఉంటేనే ఆధార్ కార్డు నిర్దారణతో చీరలు పంపిణీ చేస్తున్నారు.