చొప్పదండి, నవంబర్ 7: అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని వెదురుగట్టలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పులపాలైన పరిస్థితులు ఉండేవని ఆరోపించారు. స్వరాష్ట్రంలో పంటలకు మద్దతు ధర అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. అన్నదాతలు అధైర్యపడొద్దని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గుడిపాటి వెంకటరమణారెడ్డి, గుడిపాటి చిన్న, మారం యువరాజు, మావురం మహేశ్, పెంచాల అంజయ్య, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 44 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల 29 వేల 500 విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన బాధితులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, సర్పంచులు గుంట రవి, గుడిపాక సురేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మచ్చ రమేశ్, మహేశుని మల్లేశం, వెంకటరమణారెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.