జమ్మికుంట రూరల్, జనవరి 7: ప్రజల ఆరోగ్య సంరక్షణకు నిత్యం పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికుల జీతాలను పెంచి సీఎం కేసీఆర్ వారికి పెన్నిధిగా నిలిచారని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు కొనియాడారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో మేరకు శుక్రవారం చైర్మన్ పాత మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు పెరిగిన జీతాలు అందజేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ కార్మికులు స్వీట్లు పంచి, మున్సిపల్ చైర్మన్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. ఇక్కడ వార్డు కౌన్సిలర్లు రావికంటి రాజు, పాతకాల రమేశ్, దిడ్డి రాము, బోగం సుగుణ, టీఆర్ఎస్కేవీ పట్టణాధ్యక్షుడు దొడ్డె సంజీవ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సదానందం, కార్మికులు రాజు, సరోజన, పద్మ ఉన్నారు.
మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కార్మిక సంఘం
కార్పొరేషన్, జనవరి 7 : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ ఎంప్లాయీస్ వరర్స్ యూనియన్ సంఘాల నాయకులు, పారిశుధ్య కార్మికులు నగర మేయర్ వై సునీల్‌రావును శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య జౌట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వేతనాలు పెంచిన సందర్భంగా మేయర్‌కు కార్మిక సంఘం అధ్యక్షులు రాజమౌళి, పారిశుధ్య కార్మికులు పుష్పగుచ్ఛం అందించి, స్వీట్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మున్సిపల్ ఎంప్లాయీస్, వరింగ్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మేయర్ ఆవిష్కరించారు. యూనియన్ అధ్యక్షుడు రాజమౌళి పాల్గొన్నారు.