ఇల్లందకుంట, అక్టోబర్ 5: ఆత్మగౌరవమం టూ ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఈట ల రాజేందర్ బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నాడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం సిరిసేడు, పాతర్లపల్లి, బోగంపాడు, టేకూర్తి, మర్రివానిపల్లి, గడ్డివానిపల్లి గ్రామాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి 5వేల ఇండ్లు ఇస్తే ఈట ల రాజేందర్ ఒక్కటీ కట్టలేదని, ఆయన మాత్రం 150 కోట్లతో నాలుగు ఇండ్లు కట్టుకున్నాడని, పేదల గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు, టీడీపీ హయాంలో జన్మభూమి వంటి పథకాలతో కార్యకర్తలకు ఇండ్లు అందించారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలకు ఏం ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. రాజేందర్ పదిహేడేండ్ల పాలనలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తన ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారడంతోనే హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. ఇక్కడ సర్పంచ్‌లు రఫీఖాన్, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, రాంమల్లయ్య, లలిత, సరోజన, వెంకటస్వామి, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, మోటపోతుల ఐల య్య, తెడ్ల ఓదేలు, చిన్నరాయుడు, టీఆర్ఎస్ నాయకులు రఫీ, అంజనీకుమార్, మల్లయ్య, మల్లేశం, మల్లారెడ్డి, వాసు, అఖిల్, అజారుద్దీన్, బుజ్జమ్మ, వెంకటరమణారెడ్డి, తారక్, గడ్డిరాములు, మధుసూదన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.