సిరిసిల్ల టౌన్, జనవరి 5: స్వరాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రై తాంగానికి ఏటీఎంలా మారిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య పేర్కొన్నారు. బీజేపీ జాతీ య అధ్యక్షుడు నడ్డా ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ అంబేద్కర్ చౌరస్థాలో ఏర్పాటుచేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ సిద్ధాంతమని ఆరోపించారు. జేపీ నడ్డా అబద్ధాలకు అడ్డా అని విమర్శించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపించారని ఉద్ఘాటించారు. మతిభ్రమించిన నడ్డా కాళేశ్వరంపై అసత్యపు ఆరోపణలు చేశారన్నారు. లక్షల కోట్లు వెచ్చించి తెలంగాణ రైతాంగం కోసం ప్రాజెక్టును నిర్మిస్తే రాజకీయం కోసం నిరాధారమైన విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు పాటించాలని జీవో విడుదల చేస్తే ఆ ప్రభుత్వంలోని ఎంపీ బండి సంజయ్ ఉల్లంఘించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. బండిపోతే బండి వ స్తుంది కానీ.. గుండు గోడకు కొట్టుకుంటే మరో గుండు రాదుకదా అని ఎద్దేవా చేశారు. పోలీసులు తమ విధులు తాము నిర్వర్తించారని, దీనికి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ నేత లు వరుస కట్టి తెలంగాణలో పర్యటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు కొమిరె సంజీవ్గౌడ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, నాయకులు వంశీ, వేముల చెన్నయ్య, అశోక్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.