సుల్తానాబాద్‌రూరల్, అక్టోబర్ 4: అల్లీపూర్లో మహిళలకు ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు సోమవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ సంతోషంగా చేసుకోవాలనే చీరెలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం వసంత మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ గడ్డం రాజమణి, సుద్దాల సింగిల్ విండో చైర్మన్ మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి సతీశ్, టీఆర్ఎస్వీ నాయకుడు నిశాంత్‌రెడ్డి, సీఏలు తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్4 : తారుపల్లి, జాఫర్‌ఖాన్‌పేట, పందిల్లతోపాటు పలు గ్రామాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు.
ముత్తారం, అక్టోబర్4: ఖమ్మంపల్లి, సీతంపేట, ఇప్పలపల్లి, హరిపురం తదితర గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు పులిపాక నగేశ్, ఉప సర్పంచ్ ఓదెలు ఉన్నారు.
మంథని రూరల్, అక్టోబర్ 4 : నగరంపల్లి, చిల్లపల్లిలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తరగం సుమలత శంకర్‌లాల్, సర్పంచులు కొమ్ము పద్మ, అలుగువెల్లి స్వరూప వీరారెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణి, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎంపీటీసీ పెగడ శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
ధర్మారం, అక్టోబర్ 4: మండలానికి 18,057 చీరెలు వచ్చాయి. దీంతో తహసీల్దార్ వెంకటలక్ష్మి మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు వాటిని పంపించారు. అన్ని గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి దాకా 13,533 చీరెలు పంపిణీ చేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు.