ప్రజల గోడు పట్టనోళ్లకు అవకాశం ఇద్దామా..?
మన పథకాలు ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా..?
20 ఏండ్ల తర్వాత అభివృద్ధి వైపు హుజూరాబాద్
మీ సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం
హుజూరాబాద్ ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 4: పద్దెనిమిదేండ్లపాటు అధికారంలో ఉన్న ఈట ల రాజేందర్ హుజూరాబాద్‌లో చేసిందేం లేదు. ఆయనకు ఆస్తుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. ఈటల నిర్లక్ష్యంతో హుజూరాబాద్ ప్రగతిలో వెనుకబడింది. ఈ ఎన్నికలో మీకు అభివృద్ధి చేసేవాళ్లు కావాలా..? ఆస్తులు పెంచుకునేవాళ్లు కావాలా..? ఆలోచించాలని మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ టౌన్‌లోని 22వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా సోమవారం ఉద యం నేతలతో కలిసి ప్రచారం చేశారు. స్థానిక రాధాస్వామి సత్సంగ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కనీసం మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవో చెప్పాలన్నారు. ఈటలకు ఆస్తుల మీదే సోయి అని, మళ్లీ గెలిస్తే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడని విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలతోపాటు బావులకాడ మీటర్లు పెట్టాలని చూస్తున్న ఆపార్టీ మీద ఈటల మాట్లాడుతాడా అని ప్రశ్నించారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేస్తున్న బీజేపీని గెలిపిస్తే, మన ఆస్తులనూ అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. సామాన్యుడి గోడు ఏనా డూ పట్టని బీజేపీకి అవకాశం ఇస్తే.. మరిం త మోసపోతమని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని, గెల్లు శ్రీనును గెలిపించి సంక్షే మ కార్యక్రమాలకు బాసటగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, నాయకులు గందె శ్రీనివాస్, ప్రతాపకృష్ణ, తాళ్లపల్లి శ్రీనివాస్, ఖాజీపేట శ్రీనివాస్, రాధాస్వామి సత్సాంగ్ సభ్యులు మురుకి మారండేయ, రవీందర్, స్థానిక టీఆర్ఎస్ శ్రేణు లు, ప్రజలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నయ్. హుజూరాబాద్ మాత్రం వెనుకబడింది. ఈటల నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివృద్ధి ఇప్పుడిప్పుడే మళ్లీ మొదలైంది. దాన్ని కుంటు పడకుండా కొనసాగించాలంటే గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకోవాలి. ప్రజల గోడు పట్టని బీజేపోళ్లకు ఓటేస్తే ఏం ప్రయోజనం ఉండదు.
-మంత్రి గంగుల కమలాకర్