టీఆర్ఎస్లో కొనసాగుతున్న చేరికల జోరు
హుజూరాబాద్‌లో మంత్రి గంగుల సమక్షంలో చేరిక
జైకొట్టిన మడిపల్లి గ్రామస్తులు
కమలాపూర్, ఇల్లందకుంటలోనూ చేరిన నాయకులు
హుజూరాబాద్‌టౌన్/ఇల్లందకుంట/కమలాపూర్/జమ్మికుంట/జమ్మికుంటరూరల్, అక్టోబర్ 4: ఉప ఎన్నిక వేళ గులాబీ దూకుడు కొనసాగుతున్నది. ఇటు ప్రచార హోరు.. అటు ఏడున్నరేండ్ల ప్రగతిని చూసి పార్టీలో చేరికలతో గులాబీసేన ఫుల్ బిజీ అయిపోతున్నది. రోజురోజుకూ వలసల సంఖ్య పెరుగుతుండగా, అదే జోష్‌తో జిల్లా నాయకత్వం ప్రచారంలో దూసుకెళ్తున్నది. సోమవారం ఆయాచోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో చేరికల పర్వం కొనసాగింది.
భారీ మెజార్టీయే లక్ష్యం కావాలి: మంత్రి గంగుల
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు భారీ మెజార్టీయే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం హుజూరాబాద్‌లోని రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో 22, 27 వార్డులకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరా రు. మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చేరిన వారిలో బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి భాషవేని భాసర్యాదవ్, బీజేపీ 37వ బూత్ ఇన్చార్జి మంతుర్తి శ్రీకాంత్‌యాదవ్, 43వ బూత్ ఇన్చార్జి కాపర్తి సంతోష్‌తో పాటు 20మంది బీజేపీ కార్యకర్తలు, యువకులు తదితరులు చేరినవారిలో ఉన్నారు. ఇక్కడ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కౌన్సిలర్లు తాళ్లపలి ్లశ్రీనివాస్గౌడ్, గోస్కుల రాజు, కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, శ్రీనివాస్, నరేశ్, సాయిచరణ్, రజనీశ్రెడ్డి, మురళి, రవీందర్, రాజేందర్, శివ, రాకేశ్, లవన్, లక్ష్మణమూర్తి తదితరులున్నారు.
టీఆర్ఎస్కు జైకొట్టిన ‘మడిపల్లి’
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామం టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టింది. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 150మంది టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, క్లస్టర్ ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తర్వాత పార్టీలో చేరిన నాయకులు మాట్లాడారు. గడిచిన ఏడేళ్లలో ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదని, మంత్రి ఈటల ఎవ్వరినీ పట్టించుకోలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరామని పేర్కొన్నారు. రాబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు సీనును గెలిపిస్తామని హామీ ఇచ్చారు. నాయకుడు రాంబాబు తదితరులున్నారు.
గెల్లు సమక్షంలో 100 మంది..
జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో 100 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ పాలన, అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు. టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తామని స్పష్టంచేశారు.
పార్టీలోకి ఉప సర్పంచ్..
ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ గుత్తికొండ రవికుమార్, వార్డు స భ్యులు వాసాల లక్ష్మణ్, తిప్పరబోయిన సమ్మయ్య సోమవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఇక్కడ సర్పంచ్ మొగిలి, గ్రామ ఇన్చార్జి మాదాసు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, వార్డు మెంబర్లు ప్రభాకర్, సంతాజీ కుమారస్వామి, నాయకులు సచిన్‌రెడ్డి, లక్ష్మయ్య, ఓంప్రకాశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతో ఒరిగేదేం లేదు: విప్ బాల్క సుమన్
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ర్టానికి చేసిందేమీ లేద ని, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తున్నదని విప్ బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేస్తున్నదని, పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఉన్న కొలువులను ఊడగొడుతున్నదన్నా రు. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. కమలాపూర్ మండలం భీంపల్లికి చెంది న పలువురు యువకులు టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. మండల ఇన్చార్జి పేరియాల రవీందర్రావు, సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ భాస్కర్, నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, జవ్వాజి కుమారస్వామి, ప్రభాకర్, సారంగం తదితరులున్నారు.