సొసైటీలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
మామిడిపల్లి రైతులతో మాట ముచ్చట
కోనరావుపేట, డిసెంబర్ 3: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సూచించారు. వరి వేసి నష్టాలపాలు కావద్దన్నారు. అన్నదాతలు కలిసికట్టుగా సొసైటీలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. శుక్రవారం మామిడిపల్లిలో పర్యటించారు. శ్రీరామ, ఆదర్శ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో నీటి వనరుల లభ్యత పెరిగినందునా తీరొక్క పంటలు వేసి లాభాలు పొందాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాలని నిర్దేశించారు. చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని పండించిన ధాన్యాన్ని శుద్ధి చేసుకోవాలని కోరారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సొసైటీల బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ఇటీవలే టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులపై ఆలయ ఈవోతో చర్చించినట్లు తెలిపారు. అంతకుముందు గ్రామానికి చెందిన యాదగిరి సత్యనారాయణ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్యయాదవ్, సర్పంచ్ కొక్కుల భారత, ఎంపీటీసీ మిర్యాల ప్రభాకర్‌రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంతెన సంతోష్, ఉపసర్పంచ్ ఎల్లాల రాంరెడ్డి, సొసైటీల చైర్మన్లు మోకిడె శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు తక్కళ్ల ఎల్లారెడ్డి, కొక్కుల నర్సయ్య, సొసైటీల డైరెక్టర్లు పాల్గొన్నారు.