పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 3: తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరెలను పంపించారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. గౌరెడ్డిపేట, రంగాపూర్, ముత్తారంలో మహిళలకు బతుకమ్మ చీరెలను ఆదివారం ఆయన అందజేశారు. తుర్కలమద్దికుంట, నిట్టూరు మూలసాల తదితర గ్రామాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, సర్పంచులు కొమ్ము శ్రీనివాస్, గంట లావణ్య రమేశ్, ఎద్దు కుమారస్వామి, తంగెళ్ల జయప్రద సంజీవరెడ్డి, ఆరెపల్లి కవిత, మాజీ సర్పంచ్ ఆరెపల్లి వెంకట్రాజం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యెడ సతీశ్‌గౌడ్, పెద్దపల్లి సింగిల్ విండో డైరెక్టర్ మేకల కుమార్ యాదవ్, ఉప సర్పంచ్ గిర్నేని సంపత్‌రావు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 3: మొట్లపల్లి, లక్ష్మీపురం, పెద్దంపేట, కూనారం, ఇద్లాపూర్, మీర్జంపేట, పెగడపల్లి, పందిల్ల, తారుపల్లితోపాటు అన్ని గ్రామాల్లో జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి సర్పంచులు, ఎంపీటీసీలు చీరెలను అందజేశారు.
రామగిరి, అక్టోబర్ 3: మండల కేంద్రంలోని రాజాపూర్, బుధవారంపేట, లద్నాపూర్‌లో మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.రాజాపూర్‌లో చేపట్టిన కార్యక్రమంలో కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడారు. ఇక్కడ సర్పంచ్ పాశం ఓదెలు, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొంరయ్య, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, సోషల్ మీడియా ఇన్చార్జి బర్ల కుమార్, ఉప సర్పంచ్ కలవేన సంపత్, వార్డు సభ్యులు పొట్ల సతీశ్, ఎడ్ల లక్ష్మి, నిట్టూరి స్వరూప, టీఆర్ఎస్ నాయకులు కాదాసి రమేశ్, వేముల ప్రశాంత్, కలవేన రమేశ్ నూనేటి లింగయ్య,కన్నూరి రాజయ్య, సంగె మొగిలి, కలవేన వనిత, డీలర్ చిప్ప రాజేశం, ఉన్నారు. అలాగే బుధవారంపేటలో సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీపీ, ఉప సర్పంచ్ నరేశ్, వార్డు సభ్యులు తరుణ్, శైలజ, స్వరూప ఉన్నారు.
పెద్దపల్లిటౌన్/ధర్మారం, అక్టోబర్ 3: పెద్దపల్లి ఆరో వార్డులో కౌన్సిలర్ పెద్ది గీతాంజలి మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఇక్కడ డీలర్ వెంకన్న, పెద్ది వెంకటేశ్, శివ పాల్గొన్నారు. ధర్మారం మండలం నందిమేడారంలో చీరెలు అందజేశారు.