జనవరి 3, శంకరపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం కన్నాపూర్‌లో నూనె ఐలయ్య, కాటం మల్లమ్మకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. సర్కారు దవాఖానలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఇక్కడ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ కాటం వెంకట రమణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, నాయకులు ఉన్నారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, జనవరి 3: మానకొండూర్, వెల్ది, జగ్గయ్యపల్లి గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు అందజేశారు. ఇక్కడ జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్‌రెడ్డి, నాయకులు గుర్రం కిరణ్‌గౌడ్, దండు మనోజ్ ఉన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
మానకొండూర్, జనవరి 3: మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ , సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తదితరులు ఎంపీడీవో కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దసాని సులోచన, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, దేవ సతీశ్‌రెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, నాయకులు గుర్రం కిరణ్ గౌడ్, దండు మనోజ్, సిబ్బంది ఉన్నారు.
జేసీబీ అందజేత
తిమ్మాపూర్ రూరల్, జనవరి 3: తిమ్మాపూర్‌కు చెందిన మాతంగి స్వరూపకు పరిశ్రమల శాఖ ద్వారా మంజూరైన జేసీబీని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అందజేశారు. ఎల్ఎండీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ను కరీంనగర్ ఏఎంసీ పాలకవర్గ సభ్యులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, దొండ్ర రాజయ్య, ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు ఉన్నారు.