చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి
సేవలను కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
కార్పొరేషన్, జనవరి 3: నగరంలోని రిషి కాన్వెంట్ సూల్లో సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజికవేత్త సా విత్రీబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిషీ కాన్వెంట్ సూల్ విద్యాసంస్థల చైర్మన్ కామారపు చిన్నప్ప, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజిగిరి నవీన్, గూట్ల శంకర్, మిర్యాల్కర్ నరేందర్, మధు, రాజ్‌కుమార్, సతీశ్ తదితరులున్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో..
తెలంగాణచౌక్, జనవరి 3: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజినీకాంత్, గిరిజనసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమాసాహెబ్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బద్ధం ఎల్లారెడ్డి భవనంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించగా, నాయకులు హేమంత్, మురళి, శోభన, ప్రియాంక పాల్గొన్నారు. నగరంలోని జ్యోతీబా ఫూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లాకార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాష్ట్రప్రచార కార్యదర్శి జీఎస్ ఆనంద్, పట్టణ అధ్యక్షుడు జాంగిర్పాషా, జగన్ తదితరులు పాల్గొన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బండి మల్లయ్య యాదవ్ సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు కమలాకర్, ప్రధాన కార్యదర్శి జంగ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు
రామడుగు మండలంలో..
రామడుగు, జనవరి 3: గుండిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేశ్ సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలాధ్యక్షుడు మచ్చ పవన్, నాయకులు మచ్చ సంపత్, పొన్నం పరశురాం, సంపత్, ఆగేశ్, రియాజ్ పాల్గొన్నారు.
చొప్పదండి మండలంలో..
చొప్పదండి, జనవరి 3: మండలకేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోనూ వేడుకలను నిర్వహించి ఆమె సేవలను కొనియాడారు. కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నాయకులు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, పెరుమాండ్ల గంగయ్య, చేపూరి సత్యనారాయణగౌడ్, ఉపాధ్యాయులు రాములు, లక్ష్మి, భాగ్యలక్ష్మి, పల్లవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో..
కరీంనగర్ రూరల్, జనవరి 3: నగునూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీహరి, లైబ్రేరియన్ మోహన్‌రావు, కళాశాల అధ్యాపకులున్నారు.