ఎంపీపీ జనగామ శరత్‌రావు
తెర్లుమద్దిలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ముస్తాబాద్, జనవరి 3: గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎంపీపీ జనగామ శరత్‌రావు పేర్కొన్నారు. మండలంలోని తెర్లుమద్ది గ్రామంలో సోమవారం మండల ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను నేరుగా తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు, మేజర్ సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండలపరిధిలోని గ్రామాల్లో వారానికి ఒక రోజు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలు, గ్రామ స్థాయి నాయకులు పలు సమస్యలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టిపెట్టాలని, మరో వారంలో పూర్తి వివరాలు తెలుపాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చెర్‌పర్సన్ శీలం జానాబాయి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్‌రావు, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూంపెల్లి సురేందర్‌రావు, మండల కోఆప్షన్ సభ్యుడు సాదుల్పాషా, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, నవీన్, బాల్చంద్రంగౌడ్, ఈసరి కృష్ణ, కట్ట బాపురావు, పుట్ట చంద్రయ్యతో పాటు రైతులు, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి వెంకటేశ్, వివిధ శాఖల అధికార్లు, సిబ్బంది పాల్గొన్నారు.