మహిళలకు చీరెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, చందర్
19 రంగులు, 290 వర్ణాల్లో తయారీ
రేషన్ షాపుల్లోనూ అందజేత
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్2: కులమతాలకతీతంగా ప్రభుత్వం చీరెలను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. కాల్వశ్రీరాంపూర్‌లో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి, వైస్ ఎంపీపీ శిరీష, ఎంపీటీసీ మాదాసి సువర్ణ చీరెలు అందజేశారు.
పేద ఆడబిడ్డలకు పెద్దన్న ..
గోదావరిఖని, అక్టోబర్ 2: పేద ఆడబిడ్డలకు పెద్దన్న సీఎం కేసీఆర్ అని, బతుకమ్మ పండుగకు చీరెలను కానుకగా అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద మహిళల కోసం 19 రంగులతో 15 డిజైన్లతో 290 వర్ణాల చీరెలను తయారు చేయించారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, ధాతు శ్రీనివాస్, ఎంపీపీ అనసూర్య, జడ్పీటీసీ నారాయణ, తహసీల్దార్ రమేశ్ ఉన్నారు.
ఎలిగేడు, అక్టోబర్ 2: ఎలిగేడులో ఎమ్మెల్యే మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అలాగే 8 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు ఎంపీపీ తానిపర్తి స్రవంతి, జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్, సర్పంచుల ఫోరం మండలా ధ్యక్షుడు కొండల్‌రెడ్డి, పార్టీ మండలా ధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
సుల్తానాబాద్ రూరల్, అక్టోబర్ 2: సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లిలో ఎమ్మెల్యే, సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతి దంపతులు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, తహసీల్దార్ పాల్‌సింగ్, జడ్పీటీసీ మినుపాల స్వరూపరాణి, ఎంపీడీవో శశికళ, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ బయ్య పద్మ కొమురయ్య, సర్పంచులు వీరగోని సుజాత రమేశ్ గౌడ్, స్వరూప సాగర్‌రావు, కోమలత, రమేశ్ గౌడ్, రాజు, స్వప్న, అంజలి, అరుణజ్యోతి, లావణ్య, వెంకటలక్ష్మి, స్వరూప, బాపిరెడ్డి, గణేశ్, జమున, దేవమ్మ, అంజయ్య, సురేఖ, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జంక్షన్/సుల్తానాబాద్, అక్టోబర్ 2: పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో బతుకమ్మ చీరెలు ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్ పర్సన్లు దాసరి మమతారెడ్డి, సునీతారమేశ్, స్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానామొబిన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజు తదితరులున్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతారమేశ్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ పాల్‌సింగ్, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
రామగిరి, అక్టోబర్ 2: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొంరయ్య, జడ్పీటీసీ మాదరవేని శారదా కుమార్, ఎంపీడీవో విజయ్‌కుమార్, తహసీల్దార్ పుష్పలత బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఇక్కడ వైస్ ఎంపీపీ శ్రీదేవి భాస్కర్, సర్పంచ్‌లు అల్లం పద్మ తిరుపతి, పల్లె ప్రతిమ పీవీ రావు, పాశం ఓదెలు, ప్రత్యేక అధికారి సాయినాథ్, ఉప సర్పంచ్ దామెర శ్రీను, సిబ్బంది ఉన్నారు.
ముత్తారం, అక్టోబర్2: ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలతాఅశోక్ యాదవ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అన్ని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు అందజేశారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, తహసీల్దార్ బిట్ల సుధాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు అత్తె చంద్రమౌళి, వైస్ ఎంపీపీ సూదాటి రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, ఎంపీటీసీలు కిషన్‌రెడ్డి, బియ్యాని శ్యామల, రామగల్ల పోశమ్మ, దొడ్ల గీతరాణి, సర్పంచులు సిరికొండ బక్కారావు, సంపత్‌రావు, మహేందర్, మూడగోని సతీశ్‌గౌడ్, పర్ష లక్ష్మి, గాదం స్రవంతి, ఉప్పు సుగుణ ఉన్నారు.
పాలకుర్తి, అక్టోబర్ 2: బతుకమ్మ చీరెలను పాలకుర్తిలో సర్పంచ్ దుర్గం జగన్ మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
జ్యోతినగర్(రామగుండం), అక్టోబర్ 2: బ్రాహ్మణపల్లి, సోమన్‌పల్లి, మద్దిర్యాలలో తహసీల్దార్ సంపత్ చీరెలు పంపిణీ చేశారు. ఇక్కడ ఆర్ఐ హజీమ్, సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. రామగుండం 20వ డివిజన్లో కార్పొరేటర్ కన్నూరి సతీశ్‌కుమార్ చీరెలను అందజేశారు.
యైటింక్లయిన్ కాలనీ, అక్టోబర్ 2 : రామగుండం 17వ డివిజన్లో కార్పొరేటర్ సాగంటి శంకర్, 15వ డివిజన్ కార్పొరేటర్ బదావత్ శంకర్‌నాయక్, సుందిల్ల సర్పంచ్ దాసరి లక్ష్మి, ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో 17వ డివిజన్లో ఎరవెల్లి గోపాల్‌రావు, మేడి సదానందం, బానోత్ శంకర్‌నాయక్, నల్ల మధుకర్‌రెడ్డి, నాగమణి, సిబ్బంది గట్టయ్య, ఉమేశ్, ప్రభాకర్, శంకర్, హరిహరనాయక్, రవి పాల్గొన్నారు.
ఓదెల, అక్టోబర్ 2: మండలంలోని 22 గ్రామాల్లో 23 రేషన్ షాపుల ద్వారా చీరెల పంపిణీని చేపట్టారు. లంబాడితండాలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, మండల ప్రత్యేకాధికారి గీత, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీవో సత్తయ్య, ఏపీఎం లతామంగేశ్వరి, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ గుగులోతు నిమ్మనాయక్, నాయకులు దేవిలాల్, సేవినాయక్, వస్త్రంనాయక్, మ్యాడగోని శ్రీకాంత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్‌గౌడ్ తదితరులున్నారు.
కోల్‌సిటీ, అక్టోబర్ 2 : 8వ డివిజన్లో కార్పొరేటర్ ధాతు శ్రీనివాస్, 12వ డివిజన్లో కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్, 13వ డివిజన్లో కార్పొరేటర్ రాకం లత దామోదర్ చీరెలను మహిళలకు అందజేసి మాట్లాడారు.
ధర్మారం, అక్టోబర్2: రచ్చపల్లి, రామయ్యపల్లి, బొట్లవనపర్తి తదితర గ్రామాల్లో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ,జడ్పీటీసీ పూస్కూరు పద్మజ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డీపీవో చంద్రమౌళి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో జయశీల, ఎంపీవో కనకయ్య, ఎంపీటీసీ బెల్లాల రోజారాణి, సర్పంచులు మోర సుధాకర్, రేగుల సదన్బాబు, రెడపాక ప్రమీల, ఉప సర్పంచ్ చిందం మల్లేశం తదితరులున్నారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 2: పెద్దపల్లి మండ లం అప్పన్నపేట, అందుగులపల్లిలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో శ్రీధర్, సర్పంచులు చీకటి స్వరూప, పోచాలు, కారె శారద శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీలు తోట నర్సమ్మ శ్రీనివాస్, పందిల్ల లక్ష్మణ్, ఉప సర్పంచ్ బోండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంథని రూరల్/మంథని టౌన్ : మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఆరెంద, మల్లారం, రచ్చపల్లి సూరయ్యపల్లి, ఎక్లాస్పూర్ తదితర గ్రామాల్లో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ శ్రీరాంబట్ల సంతోషిణి చీరెలను అందజేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ బండి ప్రకాశ్, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్, సర్పంచులు జనార్దన్, సత్యనారాయణ, శ్రీనివాస్ యాదవ్, వెంకటస్వామి, వైస్ ఎంపీపీ స్వరూప్, కౌన్సిలర్లు గుండా విజయలక్ష్మిపాపారావు, కుర లింగయ్య, నాగేంద్ర శంకర్, సమ్మయ్య, సత్యనారాయణ, పద్మరమేశ్, వీకే రవి, బాణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, యూత్ అధ్యక్షుడు కొండా రవీందర్, కొట్టె రమేశ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఆకుల కిరణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.