బడుగు బలహీన వర్గాలకు అండగా ముఖ్యమంత్రి
దళిత కుటుంబాలకు ఆశాజ్యోతి
ఆయన పంపిన గెల్లును ఆశీర్వదించండి
మార్నింగ్ వాక్‌లో మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 2: సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారంతా కడుపునిండా దీవెనలందిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని దళితవాడ, 12వ డివిజన్, బోర్నపల్లి, ఇందిరానగర్ బీసీ కాలనీల్లో శనివారం మార్నింగ్ వాక్ చేస్తూ, స్థానికులతో మాట్లాడారు. దళితుల జీవితాల్లో ధైర్యం నింపిన దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన తన కోసం.. మీరు పనికిపోకుండా ఎదురుచూసి నాకు దీవెనలందించారని మురిసిపోయారు. స్థానికులు పలువురు మంత్రితో ముచ్చటిస్తూ.. గతంలో ఉన్న నాయకులు తమను ఓటు బ్యాంకుగానే చూశారని, మొదటిసారిగా సీఎం కేసీఆర్ వల్లే ధైర్యంగా బతుకుతున్నామని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన, దళిత వర్గాలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తుచేశారు. దాని ఫలితమే రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరంట్, కాళేశ్వరం నీళ్లు, పంటల దిగుబడులు, దళితబంధు వంటి పథకాలు వచ్చాయని, తద్వారా రైతుల ఆత్మహత్యలు ఆగాయన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెల్లు శ్రీను గెలుపునకు నాంది పలుకుతాయని చెప్పారు. ప్రతిచోటా గెల్లు శ్రీనును గెలిపించేందుకు తామే స్వయంగా ఓట్లు అభ్యర్థిస్తామని మహిళలు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దొంత రమేశ్, కౌన్సిలర్లు, తొగరు సదానందం, గోసుల రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్, మక్కపెల్లి కుమార్, ప్రతాప తిరుమల్‌రెడ్డి, ప్రతాప మంజుల, అపరాజ ముత్యంరాజు, టీఆర్ఎస్ నాయకులు చందమల్ల బాబు, దుబాసి బాబు, గునిగంటి మహేందర్, ముక శ్రీనివాస్, రాపర్తి శివ, సారయ్య, రమేశ్, రాజు, శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.
బుడిగజంగాల జీవితాల్లో వెలుగులు
హుజూరాబాద్ పట్టణంలోని బుడగజంగాల కాలనీలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యాలయాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బుడగజంగాలను ఆదుకోలేదని, దళితబంధు ద్వారా వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని పేర్కొన్నారు. బుడగజంగాల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోటం రాంకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మేలు జరుగుతున్నదని, వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.