జగిత్యాల టౌన్, జనవరి 2: సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల టీచర్స్ భవన్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటం ఉపాధ్యాయుల పని తీరుకు అద్దం పడుతోందన్నారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ, జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామన్నారు. పదోన్నతుల అనంతరం ఏర్పడిన ఖాళీలను, నష్టపోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరస్పర బదిలీలతో సైతం సొంత జిల్లాలకు వెళ్లేందుకు ప్రభుత్వంతో మాట్లాడి మరో అవకాశం ఇప్పిస్తానన్నారు. ప్రతి ఉపాధ్యాయుడికి న్యాయం జరిగేందుకు పీఆర్టీయూ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనంద్‌రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఏవీఎన్ రాజు, ఊట్నూరి మహేశ్, సంది శ్రీనివాస్‌రెడ్డి, మచ్చ రాజశేఖర్, పొన్నం రమేశ్, చంద్రప్రకాశ్‌రెడ్డి, బొమ్మకంటి రవీందర్, జమునారాణి, సురేఖ, ప్రశాంతి, రాజ్యలక్ష్మ, జయప్రద, వసంత, విద్య, పద్మ, రాష్ట్ర, జిల్లా, మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెన్షనర్లకు సర్కారు పెద్దపీట
జగిత్యాల రూరల్, జనవరి 2: పెన్షనర్లకు సర్కారు పెద్దపీట వేసిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2022 సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అటవీశాఖలో విశిష్ట సేవలందించిన రిటైర్డ్ జిల్లా అధికారి పూసాల అశోక్‌రావుకు జ్ఞాపికను అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ విరమణ వయసు 61కి పెంచారని, పెన్షన్ గ్రాట్యుటీ రూ.12లక్షల నుంచి 16 లక్షలకు పెంచిందని, 70 ఏండ్లకే క్వాంటం పెన్షన్ మంజూరు చేసిందని, సీపీఎస్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్, పీఆర్సీ బకాయిల చెల్లింపునకు జీవో జారీ చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, జిల్లా టీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బోగ శశిధర్, పెన్షనర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, నాగేందర్‌రెడ్డి, రఘుపతి, హన్మంతరెడ్డి, ప్రకాశ్, అశోక్‌రావు, సత్యనారాయణ, రాజేశ్వర్, యాకుబ్, ఈశ్వరయ్య, మనోహర్‌రావు, అమృత రాజం, రమణ, శ్యాంసుందర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
జిల్లా కేంద్రంలోని 4వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు గుమ్మడి సత్యం అన్న కిషన్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను, అదే వార్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు దుర్గపు శ్రీనివాస్ తండ్రి రమేశ్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కౌన్సిలర్ క్యాదాసు నవీన్, నాయకులు నాగయ్య, ప్రణయ్, గుమ్మడి లక్ష్మణ్, గాజుల సురేశ్, గుమ్మడి శేఖర్, శ్రావణ్, హరి తదితరులు ఉన్నారు.