తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ( Brahmotsavams) మంగళవారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, ప్రత్యేక పూజలు చేపట్టి ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.
కంకణబట్టార్ పి.కృష్ణసాయి ఆధ్వర్యంలో 18 గణాలను , ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.పదిరోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామివారు పలు వాహనాల్లో విహరిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్.ఏ.సీ ప్రెసిడెంట్ ఏ. వి. రెడ్డి, ఏఈవో రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ నిరంజన్, హరికృష్ణ, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.