పెద్దపల్లి కమాన్, జూలై 28 : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో జీ శారద మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఆగస్టు 28 వరకు (https://www.telangana openschool.org//utm) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ ఫారాలకు అవసరమైన ధ్రువపత్రాలను జత చేసి, సంబంధిత ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో అందజేయాలని సూచించారు. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ ఆర్ రవీందర్‌ను సెల్ నెంబర్ 9440415099లో సంప్రదించాలని సూచించారు.