వేములవాడ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్ పోటీల్లో సత్తా
ఆత్మైస్థెర్యం కోసం నిత్య వ్యాయామం.. ధ్యానం
ఇటీవలే ఓ విద్యార్థిని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
వేములవాడ, జనవరి 2: వేములవాడ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆటల్లో రాణిస్తున్నారు. కాలేజీలో ప్రస్తుతం 500 మంది అభ్యసిస్తున్నారు. విద్యతో పాటు ఆత్మైస్థెర్యం, శారీరక ధృడత్యాన్ని పెంపొందించేలా ఫిజికల్ డైరెక్టర్ చామంతి ప్రతిరోజూ శిక్షణ అందిస్తున్నారు. నచ్చిన ఆటలో ప్రావీణ్యం పొందేలా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వ్యాయామం చేయిస్తున్నారు. ఇక వీటితోపాటు కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తుండడంతో ఇప్పటికే హ్యాండ్‌బాల్, కోకో, వాలీబాల్లాంటి ఆటల్లో పలువురు విద్యార్థినులు ప్రతిభచూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తాజాగా పూజిత అనే విద్యార్థిని జాతీయస్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికకావడంపై పలువురు అభినందిస్తున్నారు.
విద్యతోపాటు క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాం..
విద్యార్థినులకు విద్యతోపాటు క్రీడల్లోనూ శిక్షణ అందిస్తున్నాం. వారికి ఇష్టమైన ఆటలను ప్రతిరోజు ఆడించి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాం. ఆత్మైస్థెర్యం, శారీరక దృఢత్వం కోసం ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా శిక్షణ అందిస్తున్నాం. ఇప్పటికే జాతీయస్థాయి పోటీలకు కూడా కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. – మాతంగి కళ్యాణి, ప్రిన్సిపాల్,
సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల వేములవాడ.
సంతోషంగా ఉంది..
కళాశాలలో నిత్యం ఇస్తున్న శిక్షణ వల్లే నేను జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక య్యా. మా కాలేజీలో విద్యతో పాటు స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. త్వరలోనే చెన్నైలో పోటీలు జరుగుతాయి. అందులో పాల్గొనబోతుండడంపై సంతోషంగా ఉంది.- పూజిత, వాలీబాల్ క్రీడాకారిణి, గురుకుల మహిళా డిగ్రీ కళాశాల వేములవాడ.