హౌసింగ్‌బోర్డుకాలనీ/తెలంగాణ చౌక్, జనవరి 2: నగరానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం మోహన్‌కు బ్రెయిన్ సర్జరీ కాగా, ఆదివారం మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ, ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో మోహన్ ఆరోగ్య పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. కుటుంబసభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, అతనికి మరోసారి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వివరించినట్లు చెప్పారు. స్పందించిన సీఎం కేసీఆర్ మోహన్‌కు మెరుగైన వైద్యం చేయించడంతో పాటు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి తనకు తెలియజేయాలని, అవసరమైతే హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌తో పాటు ఇకడి తెలంగాణ ఉద్యమకారులపై అమితమైన ప్రేమ ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు జంపాల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరాల వెంకటస్వామి, నగర అధ్యక్షుడు జంపాల సంపత్, టీఆర్ఎస్ నాయకులు కెమసారం తిరుపతి, తుల భాసర్, కొత్త నర్సింహులు, ప్యాట సురేశ్, రాకేశ్ ఉన్నారు.