పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 1: పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు విధిగా ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ -19 నిబంధనలను తప్పని సరిగా పాటించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. పాఠశాల విద్యా శాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ముద్రించిన 5 రకాల కొవిడ్ నిబంధనల వాల్ పోస్టర్ను కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 123 ప్రభుత్వ పాఠశాలలకు, 14 మండల కేంద్రాలకు 10 చొప్పున వాల్ పోస్టర్లను సేవాభావంతో అందిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఆయాజ్, కార్యదర్శి శశాంక, కోశాధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల విద్యాశాఖ ఏసీజీఈ ఎం రాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్రావు, సమగ్ర శిక్ష సమన్వయ కర్త జగదీశ్వర్, క్లబ్ సీనియర్ సభ్యులు రాజగోపాల్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు
ధర్మారం, అక్టోబర్1: మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు తన్నీరు రాజేందర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సంజీవని దవాఖానలో వైద్యుడు ప్రశాంత్ 134 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్త దాత సల్వాజి మాధవరావు, ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా కూరగాయల వ్యాపారి కనకయ్యను సన్మానించారు. ధర్మారంలో ఓ నిరుపేద ఇంటికి కవర్ను బహూకరించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పుచ్చకాయల మునీందర్, పీఆర్వో దాడి భూమయ్య, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎండీ హఫీజ్, సభ్యుడు విట్ట రవి తదితరులు పాల్గొన్నారు.