సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్1: శ్రీలలితా పరమేశ్వరి, శ్రీలక్ష్మీనారాయణ సహిత మార్కండేయ దేవాలయ శంకుస్థాప న మహోత్సవం బుధవారం జిల్లా కేంద్రంలో కనుల పం డువగా జరిగింది. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో విష్ణుసేవానందగిరి స్వామికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో విష్ణుసేవానందగిరి చేతు ల మీదుగా శంకుస్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాలను తిలకించి పులకించిపోయారు. ఈ సందర్భంగా విష్ణుసేవానందగిరి స్వామి మాట్లాడుతూ, మార్కండేయ ఆలయ నిర్మాణం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. అనంతరం పద్మశాలీ సంఘం, అనుబంధ సంఘాల నాయకులు స్వామిజి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ము న్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ, యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, దిడ్డి రాజు, మండల సత్యం, గాజుల బాలయ్య, రాపెల్లి ప్రవీణ్, చౌటపెల్లి వెంకటేశం ఉన్నారు.