గడపగడపకూ వెళ్లిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు
సంక్షేమ పథకాలు వివరించి ఓటు అభ్యర్థన
మద్దతు ప్రకటించిన ఓటర్లు
హుజూరాబాద్, సెప్టెంబర్ 1: నియోజకవర్గంలో బుధవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేశారు. కమలాపూర్ మండలం గూడూరు, గోపాల్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రచారం చేశారు. ఇల్లందకుంట మండలం వాగొడ్డురామన్నపల్లి, మల్యాల గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తల్లిదండ్రులు గెల్లు మల్లయ్య-లక్ష్మి ప్రచారం చేశారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, సెప్టెంబర్ 1: పట్టణంలోని 16వ వార్డులో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ రియాజుద్దీన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సందీప్, అర్షద్ ఖాన్, రావూఫ్, ఇర్ఫాన్, నాగరాజు, విజయ్‌కుమార్, టిప్పు తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌టౌన్, సెప్టెంబర్ 1: పట్టణంలోని 15వ వార్డులో టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు, కౌన్సిలర్ కల్లెపల్లి రమాదేవి, 4వ వార్డులో యూత్ అధ్యక్షుడు లెంకలపల్లి నవీన్‌యాదవ్, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షుడు గందె సాయిచరణ్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో 15వ వార్డు ఇన్చార్జులు, సిద్దిపేట కౌన్సిలర్లు చింతల ప్రభాకర్, నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు అర్ష మల్లేశం, బొంగోని రాధ, వడ్లకొండ కిరణ్, జంపాల రామకృష్ణ, కల్లెపల్లి రోషేందర్, పేరాల తిరుపతి, విడపు అనురాగ్, షేక్ ఫయాజ్, విక్కీ, సొల్లు అరుణ్, నవీన్, సాయి, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 1: ధర్మరాజుపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి శ్వేత ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తన భర్తను ఆశీర్వదించి, గెలిపించాలని కోరారు. ఆమె వెంట ఎంపీపీ ఇరుమల్ల రాణి, సర్పంచ్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇల్లందకుంట, సెప్టెంబర్ 1: వాగొడ్డురామన్నపల్లి, మల్యాల గ్రామాల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సర్పంచ్ పుట్ట రాజు, మాజీ సర్పంచ్ ఉడుత వీరస్వామి, ఉప సర్పంచ్ కుమారస్వామి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజయ్య, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.