కలెక్టర్ ఆర్వీ కర్ణన్
సీపీ సత్యనారాయణ, అధికారులతో కలిసి పలు ప్రాంతాల పరిశీలన
కార్పొరేషన్, జనవరి 31: నగరంలోని ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులు విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. నగరంలోని అలుగునూర్, తెలంగాణ చౌక్, రాంనగర్‌లోని ఆయుష్ దవాఖాన వద్ద, ఎస్సారార్ కాలేజీ, ఆదర్శనగర్, టవర్‌సర్కిల్ ప్రాంతాలను సోమవారం సాయం త్రం పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఇబ్బంది కలుగకుండా స్మార్ట్‌సిటీ నిర్మాణంలో భాగంగా ప్రధాన రోడ్లు, రోడ్ల పకన ఫుట్‌పాత్‌లను విశాలంగా నిర్మించామని చెప్పారు. ఫుట్‌పాత్‌లు ప్రజలు నడిచేందుకు మాత్రమేనని చెప్పారు. ఆదివారం కరీంనగర్ కమాన్ వద్ద జరిగిన దుర్ఘటనలో ఫుట్‌పాత్‌ల వద్ద కొలిమి పని చేసుకుంటున్న నలుగురు మరణించారని గుర్తు చేశారు. కొందరు చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై అమ్మకాలు జరుపుతున్నారని, ఇది నగర ప్రజలకు చాలా ఇబ్బందికరమైనదని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వారు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో తనిఖీ బృందాలను నియమించి ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. సోమవారం ప్రత్యేక టీంలతో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసే వారి ని గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు. వారి వెంట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్‌కుమార్, తహసీల్దార్ సుధాకర్, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.