చొప్పందడి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
40 మందికి రూ.10.20లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రామడుగు, జనవరి 31: బడుగుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ అందిస్తున్న గొప్ప పథకం సీఎంఆర్ఎఫ్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 40మంది లబ్ధిదారులకు రూ.10.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టానికి పోరాటయోధుడు కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ర్టాలను అధిగమించిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎదగాలంటే నీటి వనరులు అవసరమని గ్రహించి కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగం బాగుపడాలంటే అన్నదాతకు అండగా నిలువడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆరోగ్యపరంగా ఆదుకోవడానికి కోట్లాది రూపాయలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ జూపాక కరుణాకర్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, నాగుల రాజశేఖర్‌గౌడ్, జంగిలి రాజమౌళి, సైండ్ల కరుణాకర్, తౌటు మురళి, పంజాల జగన్మోహన్గౌడ్, మామిడి తిరుపతి, ఎడవెల్లి పాపిరెడ్డి, పెంటి శంకర్, మినుకుల తిరుపతి, శనిగరపు అర్జున్, లబ్ధిదారులు పాల్గొన్నారు.