మల్యాల, ఫిబ్రవరి 24: మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మిట్టపెల్లి విమల, జడ్పీటీసీ కొండపలకల రామ్మోహన్ రావు మండలానికి చెందిన 36మంది లబ్ధిదారులకు రూ.11.29లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మిట్టపెల్లి సుదర్శన్, బద్దం తిరుపతి రెడ్డి, కట్కూరి తిరుపతి, గొడుగు కుమార స్వామి, సహకార సంఘాల అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, బోయినపెల్లి మధుసూదన్ రావు, నాయకులు జనగాం శ్రీనివాస్, పొన్నం మల్లేశం, ఆకుల నగేశ్, ఆసం శివకుమార్, నలువాల బుచ్చయ్య, పోతురాజు శ్రీనివాస్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, తాటిపాముల జగదీశ్వర్, శేఖర్ పాల్గొన్నారు.
కథలాపూర్, ఫిబ్రవరి 24: తాండ్య్రాల గ్రామంలో మిట్టపల్లి గౌతమ్‌రెడ్డికి రూ. 30వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గడీల గంగాప్రసాద్ గురువారం అందజేశారు. దూలూర్, పెగ్గెర్ల గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు వేర్వేరుగా చెక్కులు పంపిణీ చేశారు. పెగ్గెర్ల గ్రామంలో బైండ్ల రమేశ్‌కు రూ. 60 వేలు, బైండ్ల గంగాధర్‌కు రూ. 26 వేలు, చీర్నం నడిపి సాయన్నకు రూ. 40 వేలు, దూలూర్ గ్రామంలో జూపాల భూమయ్యకు రూ. 60 వేలు, మేడిపల్లి రాజురెడ్డికి రూ. 24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు గండ్ర కిరణ్‌రావు, బాల్క సంజీవ్, జక్కని ప్రసాద్, మంచాల మహేశ్, పానుగంటి సాగర్, జవిడి ప్రతాప్‌రెడ్డి, చెల్లపెల్లి అంజయ్య, కుంట నరేశ్, జవిడి జలపతిరెడ్డి, బోనగిరి సురేశ్, చెదలు మహేశ్, మ్యాకల ప్రవీణ్, మహేశ్, గుండారపు గంగాధర్, నల్ల గంగాధర్, మేడిపెల్లి రాజురెడ్డి, మిట్టపెల్లి శ్రీను, బద్దం కృష్ణారెడ్డి, పడాల భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.