వీణవంక, సెప్టెంబర్ 6: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన దొడ్డు వడ్లను కొనలేమని ఉత్తర్వులు జారీ చేసి అన్నదాతల పొట్టగొడుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కమలాపూర్‌లో ఈటల రాజేందర్ చేసిన వ్యా ఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆదరించి పదవులిచ్చిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు. గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దేశంలో రైతులకు మద్దతు ధర చెల్లించింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీపై ఆధారపడి 10 వేల మంది ఉపాధి పొందుతున్నారని, వాటి ని మూసివేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. ముందు దొడ్డు వడ్లను కొనలేమని, ఇపుడు వద్దంటే ఆ ధాన్యాన్ని ఏం చేసుకొనాలో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీరును రైతులు గమనించి బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారని తెలిపారు. కేం ద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికీ వెళ్లి తెలియజేస్తామని, బీజేపీ వైఫల్యాలపై దశలవారీగా ఆందోళనలు చేస్తామన్నారు.
బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం:ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు
ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్ప డం ఖాయమని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ బీఫాంలతో గెలిచిన ప్రజాప్రతినిధులపై ఈటల రాజేందర్ నిం దలు వేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన వాళ్లు ఈటల మనుషులు ఎలా అవుతారని, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ధిని తాము చేయడం తప్పెలా అవుతుందన్నారు. ఈటల మాటలు హుజూరాబాద్ ప్రజ లు నమ్మరని, తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, సర్పంచులు కాంతారెడ్డి, కోమల్‌రెడ్డి, రమేశ్, పోతుల నర్సయ్య, ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి, నాయకులు పొదిల రమేశ్, బండ కిషన్‌రెడ్డి, తప్పెట రమేశ్, జీడి తిరుపతి పాల్గొన్నారు.