సారంగాపూర్, జనవరి 16: తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, కొల్వాయి, కండ్లపల్లి గ్రామాల్లో జరిగిన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. 37 మంది లబ్ధిదారులకు రూ.37,04,292 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, తొమ్మిది మందికి రూ.5.64లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సంపదను పెంచుతూ నిరుపేదలకు పంచుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా నియోజకవర్గంలో లబ్ధిపొందుతున్న వారి వివరాలు వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీటీసీ పాత పద్మ, వైస్ ఎంపీపీ బల్ముల లక్ష్మణ్ రావు, కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, మండల కన్వీనర్ మెరుగు రాజేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నారాపాక రమేశ్, ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, ఉపాధ్యక్షులు రామకిష్టు గంగాధర్, జిక్కినపెల్లి శ్రీనివాస్ రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్లమైపాల్ రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు గాజర్ల రాంచందర్ గౌడ్, తహసీల్దార్ ఆరిఫొద్దీన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.