జమ్మికుంట, ఆగస్టు 24: కరోనా నియంత్రణకు టీకా ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు సూచించారు. మంగళవారం ఆయన మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో పర్యటించారు. కాలనీవాసులకు కరోనాపై అవగాహన కల్పించారు. టీకా కేంద్రాన్ని సందర్శించారు. తర్వాత ఆయన మాట్లాడారు. ప్రజలంతా ఒకటో, రెండో డోసు టీకాలు వేసుకోవాలని కోరారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆర్పీలు, నాయకులు, తదితరులున్నారు.
129 మందికి కరోనా టీకా
మున్సిపల్ పరిధిలోని మూడు చోట్ల మంగళవారం ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాల్లో 129 మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి తెలిపారు. 15వ వార్డులోని గ్యాస్ గోదాం ఏరియా, 28వ వార్డులోని కేరళ స్కూల్, 30వ వార్డులోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలల్లో టీకా శిబిరాలు ఏర్పాటు చేశారు. 28వ వార్డులోని టీకా శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక పరిశీలించారు. ప్రతి ఒకరూ కరోనా టీకా తీసుకొని, ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఇక్కడ ఏఎన్ఎంలు వసంత, పద్మ, ఆశ కార్యకర్తలు, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులున్నారు.
సింగాపూర్‌లో 503 మందికి ..
సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రానికి విశేష స్పందన లభించింది. టీకా కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ మంద మంజుల ప్రారంభించారు. ఈ కేంద్రంలో 503 మంది టీకా వేసుకున్నారని చెల్పూర్ ప్రాథమిక అరోగ్య కేంద్రం వైద్యాధికారి రమాదేవి తెలిపారు. కార్యక్ర మంలో హెల్త్ సూపర్వైజర్ రమేశ్, ఏఎన్ఎంలు వనిత, కవిత, సరోజన, ఆశ కార్యకర్తలు వసంత, సరోజన, రమతో పాటు తదితరులు పాల్గొన్నారు.